Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పై సీబీఐ రెడ్ కార్నర్ నోటీస్ జారీ అనుమతించింది. ఇక ఛానల్ ఎండి శ్రవణ్ రావు పై కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీకి సిద్ధమైంది. ఫోన్ టాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఫోన్ టాపింగ్ కేసులో ప్రభాకర్ రావు పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఇంటర్ పోల్ కు సీబీఐ లేఖ రాసింది. ప్రభాకర్ రావు పై రెడ్ కార్నర్ నోటీసి అనుమతించాలని సీబీఐ కి సిటీ పోలీస్ లేఖ రాశారు. దీంతో హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తిని సీబీఐ అనుమతించింది. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు శ్రవణ్ కు రావులకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు. ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తే ప్రభాకర్ రావు ఇండియాకి తీసుకురానున్నారు. ప్రభాకర్ తో పాటు శ్రవణ్ లని ఇండియాకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అమెరికాలో ప్రభాకర్ రావు చికిత్స చేయించుకుంటున్నారు. కానీ శ్రవణ్ రావు ఆచూకీ ఇప్పటికీ కనుగొనలేక పోయిన పోలీసులు. 196 దేశాల్లో ఇంటర్పోల్ కి నిందితులను అప్పగించేకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. ఫోన్ టాపింగ్ లో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు లని విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు అంటున్నారు.
Kaleshwaram Investigation: నేటి నుంచి మళ్ళీ కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ..