erabad Crime: తెలుగు రాష్ట్రాల్లో ఓ గజ దొంగ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. పోలీసులకు దొరక్కుండా.. ఆనవాలు వదలకుండా చోరీల్లో సిద్దహస్తుడు. ముసుగులు, విగ్గులు ధరించి మహిళ వేషంలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ గా మారాడు.
Drone Cameras At Ganesh Immersion: నేడు హైదరాబాద్ మహానగరంలో దేదీవ్యమానంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం జరుగుతోంది.. హైదరాబాద్ మహానగరంలో అనేక రోడ్లు జన సంద్రంతో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సెక్రటేరియట్, తెలుగు తల్లి రోడ్డులో ఇసుక వేస్తే రాలనంత జనాలు ఉన్నారు. ఇక మరోవైపు మీడియా కూడా గణేష్ నిమజ్జనాన్ని కవర్ చేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. వీటితోపాటు ప్రజల రక్షణకు సంబంధించి పోలీసుల సెక్యూరిటీ డ్రోన్స్ కూడా ఆకాశంలో నిరంతరం వాటి పని చేస్తున్నాయి. ఎలాంటి…
దర్శనానికి వచ్చిన భక్తులు.. దేవుడికి కానుకలు సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలో.. భక్తులు ఈసారి ఖైరతాబాద్ గణేషుడి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. రూ. 70 లక్షలు కానుకల ద్వారా హుండీ ఆదాయం వచ్చినట్లు గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది.
సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21న హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'సీతారాం ఏచూరి సంస్మరణ సభ' ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నామని తమ్మినేని వీరభద్రం చెప్పారు.
ఖైరతాబాద్ బడా గణేష్ దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. రేపు శోభాయాత్ర సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చి గణేశుడిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా.. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నాంపల్లి, బేగంబజార్, మోజం జై మార్కెట్, అబిడ్స్, ట్యాంక్బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
కెనడాలో హైదరాబాద్ నగరంలోని మీర్పేట్కు చెందిన యువకుడు మృతి చెందాడు. ప్రణీత్ అనే యువకుడు కెనడాలో ఎం.ఎస్ (Master of Science) చేయడానికి అని వెళ్లాడు. అయితే.. అక్కడ చెరువులో ఈతకు వెళ్లి చనిపోయాడు.