Pink Power Run 2024: గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్.. ప్రారంభించిన దామోదర రాజనరసింహ
- మరికాసేపట్లో రన్ పూర్తి చేసుకుని గచ్చిబౌలి స్టేడియం కి చేరుకోనున్న అథ్లెట్స్..
- పింక్ పవర్ రన్ లో దాదాపుగా 5000 మంది పాల్గొన్నారు..
- పక్షి ఆకారంలో రన్నర్స్ అంతా కలిసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pink Power Run 2024: నేడు హైదరాబాద్ గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్-2024 కార్యక్రమాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. 15 నిమిషాల అనంతరం 5k రన్ ను ప్రారంభించగా.. మరో 15 నిమిషాల తరువాత 3k రన్ ను మంత్రి ప్రారంభించారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంచేందుకు సుధ రెడ్డి మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఆధ్వర్యంలో పింక్ పవర్ రన్ నిర్వహిస్తున్నారు. 10k రన్ పూర్తయ్యాక స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. మారథాన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన వారికి మెడల్స్ ను అందించనున్నారు. రన్నర్స్ ఒక్కొక్కరుగా చేరుకుని గచ్చిబౌలి స్టేడియం నుండి విప్రో సెంటర్ వరకు రన్నింగ్ కొనసాగనుంది. ఒకే సారి 3km, 5km, 10km సంయుక్తంగా నిర్వాహకులు నిర్వహించనున్నారు. సుమారు 5 వెలకు పైగా రన్నర్స్ పాల్గొన్నారు. ఈ.. పింక్ కలర్ దుస్తులతో ముస్తాబైన వీరు అందరూ కలిసి గచ్చిబౌలి స్టేడియంలో పక్షి రూపంలో మానవహారంగా ఏర్పడనున్నారు. ఈ విధంగా పక్షిరూపంలో ఏర్పడి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చేరేందుకు ప్రయత్నించనున్నారు. అయితే.. ఈ పింక్ మారథాన్‌లో పాల్గొనే ఔత్సాహికులకు ప్రత్యేక న్యూట్రిషన్ కిట్ల ను అందించనున్నారు. అంతేకాకుండా.. రేసుకు తర్వాత చేయాల్సిన వ్యాయామ చిట్కాలను తెలియజేయనున్నారు.
Astrology: సెప్టెంబర్ 29, ఆదివారం దినఫలాలు
Also Read
తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!