KBR Park: కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు చెక్.. త్వరలో అండర్‌పాస్‌లు, ప్లైఓవర్ల నిర్మాణం..
- కేబీఆర్ పార్క్ ఇప్పుడు నగరానికి నడిబొడ్డుగా మారింది..
- కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యలకు త్వరలో చెక్..
- యూ-టర్న్‌లకు బదులు అండర్‌పాస్‌లు- ఫ్లైఓవర్‌లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KBR Park: హైదరాబాద్ మహా నగరానికి దూరంగా కొండల మధ్య ఉన్న కేబీఆర్ పార్క్ ఇప్పుడు నగరానికి నడిబొడ్డుగా మారింది. నగరంలోని ప్రధాన ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ పార్కు నుంచే వెళ్లాలి. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలను కలిపే ముఖ్యమైన రహదారులు కేబీఆర్ పార్క్ నుంచి ఉన్నాయి. అంతే కాకుండా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, కృష్ణానగర్ తదితర కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాలు వ్యాపార, వాణిజ్య పరంగా ఎంతో అభివృద్ధి చెందాయి. ఐటీ, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులంతా ఈ ప్రాంతంలోనే ఉంటారు. పలు ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న కేబీఆర్ పార్కు చుట్టుపక్కల రోడ్లన్నీ ఎప్పుడు రద్దీగా ఉంటాయి. జంక్షన్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి.
Read also: Mahalskshmi Stotram: ఈ స్తోత్రాలు వింటే అనారోగ్య సమస్యలు తొలగి సత్సంతానం కలుగుతుంది..
Also Read
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యలకు త్వరలో చెక్ పెట్టనుంది. ఈ జంక్షన్లను సిగ్నల్ ఫ్రీగా మార్చేందుకు యూ-టర్న్‌లకు బదులు అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్‌లను నిర్మించి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పార్కు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు ఇకపై యూ-టర్న్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేని విధంగా కేబీఆర్ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించనుంది. ఈ మేరకు పార్కు చుట్టూ ఉన్న ఆరు జంక్షన్లను రూ.826 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు సీఎం నిధులు మంజూరు చేశారు. పరిపాలన అనుమతులు ఇచ్చారు. హెచ్‌సీటీ ప్రాజెక్టులో భాగంగా ఆరు జంక్షన్‌లను అభివృద్ధి చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి డిజైన్లు కూడా సిద్ధం చేశారు. జంక్షన్ల అభివృద్ధి పనులు త్వరలో చేపట్టనున్నారు. 2 దశల్లో ఆరు జంక్షన్లను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
KBR ఎంట్రన్స్ ముగ్ధా జంక్షన్
* జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుండి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వరకు 2 లేన్ అండర్‌పాస్
* పంజాగుట్ట వైపు నుండి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు మూడు లేన్ ఫ్లైఓవర్
* KBR ప్రవేశ జంక్షన్ నుండి పంజాగుట్ట వైపు మూడు లేన్ల అండర్ పాస్
Balakrishna : మోక్షజ్ఞ సినిమా పై క్రేజీ కామెంట్స్ చేసిన బాలయ్య
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..