Hyderabad Metro: హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలకు మెట్రో సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం రెండో దశలో కొత్త కారిడార్లను చేపడుతోంది. ప్రధానంగా నగర శివారు ప్రాంతాల ప్రజలు నగరానికి సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మొత్తం 116.2 కిలోమీటర్ల పొడవునా రెండు దశల్లో మెట్రోను నిర్మించనున్నారు. రూ. 32,237 కోట్ల అంచనా వ్యయంతో రెండో దశ మెట్రో రైలు పనులు చేపట్టనున్నారు. రెండవ దశలో, కొత్త ఫ్యూచర్ సీటీ కోసం మెట్రో ఏర్పాటు చేయబడుతుంది. విమానాశ్రయం నుండి స్కిల్ యూనివర్సిటీకి 40 కి.మీ. మేర మెట్రో లైన్ నిర్మిస్తారు. మెట్రో రైలు రెండో దశ డీపీఆర్‌లను ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించిన సంగతి తెలిసిందే.
విమానాశ్రయం మెట్రో అలైన్‌మెంట్ మార్చబడింది. ఆరాంఘర్-బెంగళూరు హైవేపై కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి మెట్రోను ఖరారు చేశారు. నాగోల్ – శంషాబాద్ విమానాశ్రయానికి 36.6 కి.మీ మార్గాన్ని ఆయన ఆమోదించారు. విమానాశ్రయ కారిడార్‌లో 1.6 కిలోమీటర్ల మేర మెట్రో భూగర్భంలోకి వెళ్లనుంది. రూ. 8 వేల కోట్ల అంచనా వ్యయంతో నాలుగో నగరానికి మెట్రో ఏర్పాటు కానుంది. మెట్రో రెండో దశ డీపీఆర్‌లను కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం త్వరలో పంపనున్నారు. మొదటి దశలో 3 కారిడార్లలో 69 కి.మీ. మేరా మెట్రో నడుస్తుంది. రెండో దశలో మరో 6 కారిడార్లలో 116.2 కి.మీ. మేరా మెట్రో ప్రయాణం చేస్తుంది. రెండో దశ పూర్తయితే 9 కారిడార్లలో మొత్తం 185 కి.మీ. మెట్రో పరుగులు పెడుతుంది.
Devara: దేవర గ్రాండ్ సక్సెస్ మీట్… ఎప్పుడంటే..?