Damodar Raja Narasimha: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ లో వరల్డ్ ఫార్మసిస్ట్స్ డే ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఫార్మాసిస్టులకు ఎంతో డిమాండ్ ఉందన్నారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఫార్మసిస్టులు కీలకపాత్ర పోషిస్తారన్నారు. Mallu Bhatti Vikramarka:…
R. Krishnaiah: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సమావేశం అయ్యారు. విద్యా నగర్లోని కృష్ణయ్య నివాసానికి వెళ్లిన ఎంపీ రవి, కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించినట్లు బీసీ సంక్షేమ సంఘం నాయకులు చెప్పుకొచ్చారు.
HYDRA Demolition: మూసీ నది వైపు హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్లనున్నాయి. ఈ వీకెండ్ లో మూసి రివర్ ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే శని, ఆదివారాల్లో భారీగా మూసి ఆక్రమణల కూల్చివేతలు కొనసాగించనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధ్వంసక పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. ఆర్ఆర్ ట్యాక్స్, కూల్చివేతల కారణంగా రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా పడిపోయిందన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపకపోవడంతో.. హైదరాబాద్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ మహా నగరం ఇవాళ గందరగోళ పరిస్థితుల్లో కూరుకుపోయిందంటూ కేటీఆర్ మండిపడ్డారు.
Chicken Price: మాసం ప్రియులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. మొన్నటి వరకు కాస్త దిగి వచ్చిన చికెన్ రేటు ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరగడంతో కొనుగోలు చేసేందుకు సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.
Heavy Flood Water: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోత వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక, రంగారెడ్డి జిల్లాలో జంట జలాశయాలు నిండు కుండలుగా కనిపిస్తున్నాయి. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది.
ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం భారీ సాయం అందించింది. హైదరాబాద్లోని హయత్నగర్లో 600 చదరపు గజాల స్థలాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయించింది. కాగా.. ఆ ఇంటి స్థలం ధ్రువపత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగిలయ్యకు అందజేశారు. మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన వారిలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ కూడా ఉన్నారు. కాగా.. స్థల ధ్రువీకరణ పత్రం అందజేయడంపై మొగిలయ్య సంతోషం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటి వరకూ ఎండ కొట్టినప్పటికీ, ఒక్కసారిగా చల్లబడిపోయింది. దీంతో.. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, కూకట్ పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం పడుతుంది. గత మూడు రోజులుగా రోజు సాయంత్రం కాగానే కుండపోత వాన పడుతుంది. కేవలం నగరంలోనే కాకుండా.. పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతుంది.