వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం కాకరేపుతున్నాయి. హైదరాబాద్ లో మకాం వేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఒంగోలు వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. వైసీపీకి బాలినేని రాజీనామా చేస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. రెండు రోజుల క్రితం పార్టీ అధినేత జగన్ తో బాలినేని శ్రీనివాస రెడ్డి సమావేశమయ్యారు.
CM Revanth Reddy: లా అండ్ ఆర్డర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారన్న సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
MMTS: ఎంఎంటీఎస్ రైళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు మాత్రమే తిరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ, తాజాగా రాత్రి నుంచి తెల్లవారుజూము వరకు కూడా సర్వ్ చేసేందుకు సిద్ధమైంది.
డ్యూటీలో భాగంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు.. భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారులో దాదాపు రూ.3 కోట్ల విలువైన 4 కిలోల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. రోడ్డుమార్గాన తరలిస్తున్న నిందితులు పోలీసులకు చిక్కారు. వారు.. ఆ బంగారాన్ని కోల్కతా నుంచి తీసుకువస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తనిఖీల్లో భాగంగా కార్లను తనిఖీ చేస్తుండగా.. కారు డిక్కీలో బంగారం దాచి తీసుకెళ్తున్న ముఠా గుట్టు బయట పడింది.
SC Railway Special trains: బతుకుదెరువు కోసం చాలామంది వారి సొంత ఊరును వదిలి సిటీలకు వచ్చి జీవనం కొనసాగిస్తుండడం ఈరోజుల్లో పరిపాటుగా మారింది. అయితే ఏదో ముఖ్యమైన పనులు ఉన్న సమయంలో, లేకపోతే ఏదైనా పండుగ సమయంలో సొంత ఊర్లకి వెళ్లేటప్పుడు ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండుగ సమయాల్లో సొంత ఊరికి వెళ్లేందుకు ప్రజలు అధిక రేట్లను వెచ్చించి మరి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా హిందూ పండుగలు అయినా…
CPI Red Salute Rally: హైదరాబాద్ నగరంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ సీపీఐ రెడ్ సెల్యూట్ ర్యాలీ నిర్వహించింది. కవులు, కళాకారులతో కలిసి ముగ్దమ్ స్టాచ్యు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు రెడ్ టీ షర్ట్స్ ధరించి ర్యాలీ కొనసాగింది.
Rave Party: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. వారి నుంచి గంజాయి ప్యాకేట్స్, ఈ సిగరేట్, మద్యం స్వాధీనం చేసుకున్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. ఈ సన్నివేశం మీతో పాటు నాకు కూడా మధుర జ్ఞాపకం అన్నారు. మా ప్రభుత్వం 30 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది.. మరో 35 వేల ఉద్యోగాలను ఈ ఏడాది చివరిలోగా ఇస్తామన్నారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశాం.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షలపై ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు అని ఆయన చెప్పుకొచ్చారు.