మానవత్వం ఉన్న మనుషులైతే మూసీ ప్రక్షాళనకు మద్దతు ఇస్తారని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. మూసి నరకం నుంచి నల్గొండ జిల్లా ప్రజలకు విముక్తి కలుగుతుందన్నారు. మూసి పరివాహక ప్రాంతాల్లో పండే పంటలో ఐరన్ ఎక్కువ అని ప్రియాంకా వర్గీస్ స్టడీ రిపోర్ట్ ఇచ్చారన్నారు. ఓ వైపు ఫ్లోరిన్.. ఇంకో వైపు మూసి అంటూ మంత్రి తెలిపారు.
నేటి నుండి హైదరాబాద్లో డీజే పై నిషేధం విధించారు. శబ్ద కాలుష్యం వల్ల డీజేను నిషేధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాదులో డయల్ 100కు ఫిర్యాదులు రావటంతో నగరంలోని రాజకీయ పార్టీ ప్రతినిధులు , అన్ని మత పెద్దలతో చర్చ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంబర్ పేట్ నియోజకవర్గం గోల్నాకలోని తులసీ నగర్లో మూసీ బాధితులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్లో దసరా, బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రజలకు ఆనందం లేకుండా రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఆయన విమర్శించారు. ఎప్పుడు వచ్చి ఇళ్లు కూల్చివేస్తారోనని పేద ప్రజలు భయంతో ఆందోళనలో ఉన్నారన్నారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో రెవిన్యూ అధికారులు కూల్చివేతలు చేపటటారు. మూసీ రివర్ బెడ్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తొలగిస్తున్నారు. మలక్పేట పరిధిలోని శంకర్ నగర్లో స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు.
ఎగువ ప్రాంతాల నుంచి గండిపేట జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే గండిపేట జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో ఈ జలాశయం ఆరు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్ఎంపీ వైద్యుడి భార్య దారుణంగా హత్యకు గురైంది. ఆర్ఎంపీ వైద్యుడి భార్యను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.
Here is Cyberabad Police Warnings to Hyderabad Peoples: ‘దసరా’ పండగను స్వగ్రామాల్లో జరుపుకునేందుకు హైదరాబాద్ నగరవాసులు అందరూ తరలివెళ్తున్నారు. విజయదశమి వరకు నగరం అంతా ఖాళీ కానుంది. ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోయే అవకాశముంది. ఖాళీగా ఉన్న ఇంట్లో చొరబడి దొరికినకాడికి దోచుకునే అవకాశం ఉంది. ఈ దొంగతనాల నివారణకు సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఇంటికి తాళాలు వేసి ఊరు వెళ్లాల్సి వస్తే.. తగిన ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే వెళ్లాలని హెచ్చరించారు.…
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మొత్తం 116.2 కిలోమీటర్ల పొడవునా రెండు దశల్లో మెట్రోను నిర్మించనున్నారు.
KBR Park: హైదరాబాద్లోని హైదరాబాద్ మహా నగరానికి దూరంగా కొండల మధ్య ఉన్న కేబీఆర్ పార్క్ ఇప్పుడు నగరానికి నడిబొడ్డుగా మారింది. నగరంలోని ప్రధాన ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ పార్కు నుంచే వెళ్లాలి.