తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన స్కిల్స్ యూనివర్సిటీని ఈ ఏడాది నుంచే ప్రారంభించిన విషయం తెలిసిందే. లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, హెల్త్‌కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ అడ్మిషన్ ప్రక్రియ పూర్తైంది. టీచింగ్ సైతం నడుస్తోంది. తాజాగా ఈ యూనివర్సిటీకి దీనికి అదానీ గ్రూప్ ప్రోత్సాహం అందించింది. రూ.100కోట్ల భారీ విరాళాన్ని సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు.
READ MORE: KTR : మూసీని మురికి కూపంగా మార్చిన పాపం.. కాంగ్రెస్, టీడీపీలదే
గౌతమ్ అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భాంగా తెలంగాణ సీఎం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. “అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ శ్రీ గౌతమ్ అదాని గారు మర్యాదపూర్వకంగా కలిశారు. అదానీ ఫౌండేషన్ నుంచి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100కోట్ల విరాళం చెక్కు రూపంలో అందజేశారు.” అని ముఖ్యమంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు.
అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ గౌతమ్ అదాని గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
అదానీ ఫౌండేషన్ నుండి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100కోట్ల విరాళం చెక్కు రూపంలో అందజేశారు. pic.twitter.com/mxMonqa8w8
— Revanth Reddy (@revanth_anumula) October 18, 2024