వైన్ షాపుకు వెళ్లామంటే.. చుక్కేయాలంటే ముక్క ఉండాల్సిందే. లేదంటే.. మందు గరం గరం ఉండి తాగలేకపోతారు. అందుకోసమని.. వైన్ షాపు ముందు పెట్టే చికెన్, చేపలు, గుడ్లు ఇలా ఏదొక నాన్ వెజ్‌ను తెచ్చుకుని కానించేస్తారు. తక్కువ ధరకు దొరుకుతుందని.. వైన్ షాపు ముందు పెట్టే చికెన్‌ను తిన్నారంటే అంతే సంగతులు.. ఎందుకంటే అది కుళ్లిన చికెన్. అది తింటే కడుపులోపల డైజేషన్ కాక.. వాంతులు, విరోచనాలు, మల విసర్జన లాంటివి అవుతుంటాయి. చికెన్ ఇంకొంచెం ఎక్కువగా పాడైతే మనిషి సీరియస్ కూడా అవుతాడు. అంతేకాకుండా.. ఆ చికెన్ తినడం వల్ల తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అసలు విషయానికొస్తే…
హైదరాబాద్ నగరంలో కుళ్ళిపోయిన చికెన్ అమ్ముతున్న గోడౌన్ పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జీఎస్ఎంసీ అధికారులు దాడులు నిర్వహించారు. కుళ్లిపోయిన 200 కేజీల చికెన్, గోడౌన్‌ను అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా.. గోడౌన్ కు సంబంధించి అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేవు. బేగంపేట్, ప్రకాష్ నగర్ చికెన్ గోడౌన్‌లలో టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు దాడులు చేసి, తనిఖీలు నిర్వహించారు. చికెన్ గోడౌన్‌లలో కుళ్లిపోయిన చికెన్‌తో చిందరవందరగా ఉండడంతో అధికారులు అవాక్కయ్యారు.
Read Also: Cities disasters : మహానగరాలకే ఎందుకీ విపత్తులు..?
గోడౌన్ యజమాని బాలయ్య కుళ్ళిపోయిన చికెన్‌ను విక్రయిస్తున్నారని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో.. టాస్క్‌ఫోర్స్ అధికారులు గోడౌన్‌లో 200 కేజీల కుళ్లిపోయిన చికెన్‌ను సీజ్ చేశారు. ఈ గోడౌన్‌కు సంబంధించిన అధికారుల నుండి ఫుడ్ లైసెన్స్ కూడా లేకుండా వ్యాపారం కొనసాగిస్తున్నారని అధికారులు తెలిపారు. హోల్‌సేల్ చికెన్ షాప్ అని రెగ్యులర్ కస్టమర్లకు తక్కువ ధరకు అమ్ముతున్నట్టు విచారణలో వెల్లడయ్యింది. చౌకగా చికెన్ రూ.50 కేజీ అనడంతో సిటీ ప్రాంతంలో ఉన్న అన్ని వైన్స్ షాపుల దగ్గర ఉన్న హోటళ్లలో ఇక్కడ నుంచి చికెన్ తీసుకువెళ్లి గుమగుమలాడే చికెన్ తయారు చేసి కస్టమర్లకు అమ్ముతున్నారు. ఈ కుళ్లిపోయిన చికెన్ తినడం వల్ల జనాలు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి కుళ్ళిపోయిన చికెన్ అమ్ముతున్న యజమానులపై, షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.