Kidnap Case: పాతబస్తీలో మూడు సంవత్సరాల బాలిక కిడ్నాప్?
- పాతబస్తీలో మూడేళ్ల బాలిక కిడ్నాప్?
- బాలికను ఓ యువకుడు ఎత్తుకొని వెళ్తుండగా పట్టుకున్న కుటుంబసభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidnap Case: మూడు సంవత్సరాల బాలికను కిడ్నాప్‌కు పాల్పడిన యువకుడిని బండ్లగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండ్లగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అల్ జుబేల్ కాలనీకి చెందిన సోహైల్ (25) బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 27వ తేదీన సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన మూడు సంవత్సరాల మైనర్ బాలిక ఇంటి బయట ఒంటరిగా ఆడుకుంటుంది. దీంతో సదరు బాలికను సోహైల్ అనే యువకుడు చంకన ఎత్తుకొని చాంద్రాయణగుట్ట చౌరస్తాలోని మహంకాళి ఆలయం రూట్‌లో తీసుకెళ్తుండగా అప్పటికే వెతుకుతున్న బాలిక కుటుంబ సభ్యులు పట్టుకొని బండ్లగూడ పోలీసులకు అప్పగించారు.
Read Also: Union Minister Bandi Sanjay: పగలు, పట్టింపులు పక్కనబెట్టి ఏపీ అభివృద్ధికి సహకరించాలి..
Also Read
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండ్లగూడ పోలీసులు సోహైల్‌పై కిడ్నాప్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. సోహైల్ మాత్రం తాను కిడ్నాపర్‌ను కాదని, బాలిక తప్పిపోయిందని వారిని తల్లిదండ్రులకు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసుల విచారణలో చెప్పడం గమనార్హం. దీంతో పోలీసులు సోమవారం ఉదయం సీసీ కెమెరాలను పరిశీలించనున్నారు. ఇది కిడ్నాపా? కాదా? లైంగిక దాడికోసం తీసుకెళ్తున్నాడా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!