Bathukamma Festival Secret: తెలంగాణా రాష్ట్రంలో మాత్రమే ప్రకృతిని దేవతగా భావించి ఆరాధించే సాంప్రదాయం కనిపిస్తుంది. విజయ దశమికి 10 రోజుల ముందు నుండి తెలంగాణా ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.
కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ చుట్టూ అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, సిగ్నళ్లు, యూటర్న్లు లేకుండా చర్యలు చేపట్టింది. 826 కోట్ల రూపాయలతో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు పాలనాపరమైన అనుమతులిచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
Hyderabad: హైదరాబాద్ నగరంలోని మియాపూర్ దీప్తి శ్రీనగర్ లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్పందన మాజీ ప్రియుడే హత్య చేసినట్లు తెలింది. మియాపూర్ సీబీఆర్ ఎస్టేట్లో స్పందన హత్యకు గురైన తర్వాత సీసీటీ పుటేజ్ ఆధారంగా మర్డర్ చేసింది మందల మనోజ్ కుమార్ (బాలు) గుర్తించారు.
TGPSC Office: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదుట గ్రూప్-1 పోస్టర్లు కలకలం సృష్టించాయి. కమిషన్ కార్యాలయం గోడలు, గేట్లపై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడి ఫొటోలతో కూడిన పోస్టర్లు వెలిశాయి.
CM Revanth Reddy: నేటి నుంచి ఈ నెల 7వ తేదీ వరకు కుటుంబ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఒకే రాష్ట్రం ఒకే కార్డు విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మానవత్వం ఉన్న మనుషులైతే మూసీ ప్రక్షాళనకు మద్దతు ఇస్తారని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. మూసి నరకం నుంచి నల్గొండ జిల్లా ప్రజలకు విముక్తి కలుగుతుందన్నారు. మూసి పరివాహక ప్రాంతాల్లో పండే పంటలో ఐరన్ ఎక్కువ అని ప్రియాంకా వర్గీస్ స్టడీ రిపోర్ట్ ఇచ్చారన్నారు. ఓ వైపు ఫ్లోరిన్.. ఇంకో వైపు మూసి అంటూ మంత్రి తెలిపారు.
నేటి నుండి హైదరాబాద్లో డీజే పై నిషేధం విధించారు. శబ్ద కాలుష్యం వల్ల డీజేను నిషేధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాదులో డయల్ 100కు ఫిర్యాదులు రావటంతో నగరంలోని రాజకీయ పార్టీ ప్రతినిధులు , అన్ని మత పెద్దలతో చర్చ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంబర్ పేట్ నియోజకవర్గం గోల్నాకలోని తులసీ నగర్లో మూసీ బాధితులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్లో దసరా, బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రజలకు ఆనందం లేకుండా రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఆయన విమర్శించారు. ఎప్పుడు వచ్చి ఇళ్లు కూల్చివేస్తారోనని పేద ప్రజలు భయంతో ఆందోళనలో ఉన్నారన్నారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో రెవిన్యూ అధికారులు కూల్చివేతలు చేపటటారు. మూసీ రివర్ బెడ్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తొలగిస్తున్నారు. మలక్పేట పరిధిలోని శంకర్ నగర్లో స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు.