Kishan Reddy: కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్ని భర్తీ చేస్తాం..
- కేంద్ర ప్రభుత్వ రోజ్ గార్ మేళా
- హైదరాబాద్‌లో నియామక పత్రాలు అందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- తెలంగాణలో 155 మందికి నియామక పత్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: కేంద్ర ప్రభుత్వ రోజ్‌గార్ మేళాలో భాగంగా నేడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను ప్రధాని, కేంద్ర మంత్రులు నేడు అందజేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 51 వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 155 మందికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. 10 విభాగాల్లో ఉద్యోగాలు ఉండగా.. ఒక్క పోస్టల్ డిపార్ట్ మెంట్‌లోనే 119 మందికి నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ చేరుకుందన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా తయారు కావడానికి యువశక్తిని వినియోగించుకోవడం అవసరమన్నారు. 2047 వరకు వికసిత భారత్ కోసం శక్తి సామర్థ్యాలు సమకూర్చుకోవాలన్నారు. అనేక కంపెనీలకు మన వాళ్ళు సీఈఓలుగా ఉన్నారని తెలిపారు. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాం.. మాతృ భాషలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఏది కనుగొన్నా దానిలో భారతీయుల మేధస్సు ఉందని తెలిపారు. 75 దేశాలకు డిఫెన్స్ పరికరాలు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నామని చెప్పారు.
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
Read Also: Tirupati Crime: అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ అనుమానాస్పద మృతి
ఈ రోజు ఎక్కడ కూడా ఉగ్రవాద కార్యక్రమాలు లేకుండా ఐఎస్ఐ మూలాల్ని ఉక్కుపాదంతో అణచి వేశామని వెల్లడించారు. విద్యుత్ మిగులు ఉన్న నూతన భారత్‌ను మోడీ ఆవిష్కరించారన్నారు. పేదవాడి ఇంట్లో టాయిలెట్ నుండి మొదలు పెడితే చంద్రయాన్ వరకు అన్నింటి పైన మోడీ సర్కార్ దృష్టి పెట్టిందన్నారు. యువశక్తి లేని దేశం అభివృద్ధి చెందడం కష్టం… వచ్చే 25 ఏళ్లు ఇండియాకి అమృత కాలమని తెలిపారు. 25 ఏళ్ల తర్వాత దేశంలో యువత తగ్గిపోతుందన్నారు. ఈ దేశాన్ని, తల్లిదండ్రులను, సొంత గ్రామాన్ని, మాతృ భాషను మరవకండి అంటూ యువతకు కేంద్రమంత్రి సూచించారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. కేంద్ర మంత్రులు దీపావళి సైనికులతో జరుపుకోవాలని ప్రధాని మోడీ ఆదేశాలు ఇచ్చారని.. తాను వెళ్తున్నానని చెప్పారు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!