హైదరాబాద్ నగరంలో నెల రోజుల పాటు పోలీస్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 163 ప్రకారం ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేదం విధిస్తున్నట్లు వెల్లడించారు. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. నవంబర్ 28వరకు వరకు నెలరోజుల పాటు ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
READ MORE: Food Poison: మోమోస్ తిని ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి, 20 మందికి పైగా అస్వస్థత
అనంతరం పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తాజాగా మరో ఎక్స్ వేదికగా మరో ప్రకటన విడుదల చేశారు. “ఈ ఆంక్షలకు దీపావళి పండుగ వేడుకలకు ఎలాంటి సంబంధం లేదు. అనేక రకాల ఆందోళనలు, సచివాలయం, సీఎం నివాసం, డీజీపీ కార్యాలయం, రాజ్‌భవన్ మొదలైన వాటిపై ఆకస్మిక దాడులకు కొన్ని గ్రూప్లు ప్లాన్ చేస్తున్నాయి. ఈ అంశంపై మాకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందింది. అలాంటి వారిని అరెస్టు చేయడంలో పోలీసు చర్యకు చట్టపరమైన మద్దతునిచ్చేలా ఈ నోటిఫికేషన్ ఇవ్వబడింది. అవసరాన్ని బట్టి దేశవ్యాప్తంగా పోలీసులు దీన్ని చాలా మామూలుగా చేస్తారు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నందున ఈ వివరణ ఇస్తున్నాం. ఇది కర్ఫ్యూ కాదు. కాబట్టి ఎలాంటి చింత వద్దు.” అని ఆయన స్పష్టం చేశారు.
READ MORE:IND vs AUS: ఎందుకు అతడి కెరీర్‌తో ఆడుకుంటున్నారు.. శ్రీకాంత్ అసంతృప్తి!