IAS Amoy Kumar : ఐఏఎస్ అమోయ్ కుమార్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని పలువురు బాధితులు హైదరాబాద్ బషీర్ బాగ్ లో ఈడీ అధికారులను కలిశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా గతంలో పనిచేసిన అమోయ్ కుమార్ పై రంగారెడ్డి జిల్లా వట్టినపులపల్లిలోని… శంకర్ హిల్స్ ప్లాట్స్ పర్చేజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 1983లో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టి నాగులపల్లిలోని 460 ఎకరాల్లో… 3,333 ప్లాట్లను కొనుగోలు చేశామని అసోసియేషన్ సభ్యులు లక్ష్మీ కుమారి, కృష్ణారెడ్డి లు తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా తమ ప్లాట్ లను వేరే వారిపై రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. ఇప్పుడు ఓనర్లమైన తమను ప్లాట్ల దగ్గరికి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారన్నారు.
KTR : ఇది ఆత్మహత్య కాదు.. హైడ్రా అనే అరాచక సంస్థతో రేవంత్ రెడ్డి చేయించిన హత్య
మాజీ మంత్రి అండతో తమ ప్లాట్ లను వ్యవసాయ భూమిగా చిత్రీకరించి… విద్యుత్ పర్మిషన్ తీసుకొని కబ్జా చేశారని తెలిపారు. కేటిఆర్ స్నేహితుల కంపెనీలు అయిన ఫోనెక్స్, శ్రీనిధి కంపెనీలకు కట్టబెట్టారని ఆరోపించారు. అప్పటి మంత్రి ప్రోద్భలంతోనే కలెక్టర్ అమోయ్ కుమార్ స్థలాల బదలాయింపు చేశారని పేర్కొన్నారు. అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు సుమారు 200 ఎకరాల తమ ఫ్లాట్ లను వేరే వారికి రిజిస్ట్రేషన్లు చేయించారన్నారు. తమ స్థలాన్ని గత ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు , బ్యూరోక్రాట్స్ ఉన్నారని… వేల కోట్లు విలువ చేసే తమ ప్లాట్ లను తమకు ఇప్పించాలని… అవినీతికి పాల్పడిన ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
UP: ఫోన్ లిఫ్ట్ చేయలేదని.. వివాహిత ప్రియురాలిని గొడ్డలితో నరికి చంపిన ప్రేమికుడు..