Tragedy: అంధ తల్లిదండ్రులకు అంతులేని విషాదం.. కొడుకు చనిపోయినా..
- నాగోల్‌లో అంధ తల్లిదండ్రులకు అంతులేని విషాదం
- కుమారుడు మృతి చెందిన విషయం తెలియని వైనం
- మూడు రోజుల పాటు తిండి..తిప్పలు లేక అవస్థలు
- దుర్వాసన రావడంతో స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: కొడుకు చనిపోయిన విషయం తెలియక మూడు రోజుల పాటు అంధకారంలోనే ఉండిపోయారు అంధ తల్లిదండ్రులు. మనసును కలచివేసే ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని నాగోల్‌లో చోటుచేసుకుంది. కొడుకు మృతి నాగోల్‌లో అంధ తల్లిదండ్రులకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. కుమారుడు మృతి చెందిన విషయం తెలియని పరిస్థితిలో మూడు రోజుల పాటు తిండి, తిప్పలు లేక ఆ అంధ వృద్ధ దంపతులు అవస్థలు పడ్డారు. ఆ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు మృతి చెందాడు అనే విషయం తెలియని పరిస్థితుల్లో అంధ తల్లిదండ్రులు ఉండగా.. నాగోల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారికి అండగా నిలిచారు. వారికి స్నానం చేయించి అన్నం పెట్టించారు నాగోల్ సీఐ సూర్య నాయక్. పోస్టుమార్టం కోసం మృతదేహం తరలించారు.
Read Also: Train Accident: ప్యాసింజర్ రైలులో పేలుడు.. కోచ్‌లో దట్టమైన పొగలు..
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
నాగోల్ డివిజన్ పరిధిలోని జైపురి కాలనీ బ్లైండ్స్ కాలనీలో నివాసం ఉండే రమణ(65), శాంతకుమారి(60) వృద్ధ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రదీప్ తన కుటుంబ సభ్యులతో మరొక చోట ఉంటుండగా.. చిన్న కుమారుడు ప్రమోద్(30) తల్లిదండ్రులతోనే నివాసం ఉంటున్నాడు. ప్రమోద్‌కు పెళ్లి అయినా పలు కారణాలతో భార్య వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఆ కారణంతో మద్యానికి బానిసయ్యాడు. అటు మద్యానికి బానిసైనప్పటికీ తల్లిదండ్రులకు అండగా ఉంటూ వారిని చూసుకునేవాడు. మద్యం ఎక్కువగా సేవిస్తుండటంతో ఆరోగ్య పూర్తిగా క్షీణించింది. మద్యం మత్తులోనే 3 రోజుల క్రితం ప్రమోద్ చనిపోయాడు. తమ కుమారుడు చనిపోయినట్లుగా ఇంట్లో అంధులైన తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు. వృద్దాప్య దశలో ఏమీ చేయలేని స్థితిలో ఆ వృద్ధ దంపతులు ఉండిపోయారు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ఈ క్రమంలో ఎవరూ అటువైపు చూడకపోవటంతో మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వచ్చింది. దుర్వాసన వస్తుండడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఒకవైపు ఆకలితో, మరోవైపు భరించలేని కంపు వాసనతో దీనావస్థ స్థితిలో ఉన్న వృద్ధ దంపతులను బయటికి తీసుకొచ్చారు. ఆ వృద్ధ దంపతులకు స్నానం చేయించి.. భోజనం ఏర్పాట్లు చేసి మానవత్వం చాటుకున్నారు. అనంతరం వృద్ధులతో మాట్లాడుతూ.. వారి కుటుంబ వివరాలను తెలుసుకొని.. తమ చిన్నకొడుకు ప్రమోద్ చనిపోయాడని వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పెద్ద కొడుకును పిలిపించి వృద్ధ దంపతులను అప్పజెప్పారు.
తాజావార్తలు
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!