హైదరాబాద్ శివార్లలో డ్రగ్స్ పార్టీపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. శని, ఆదివారాలు వచ్చాయంటే రేవ్ పార్టీలు అని విచ్చల విడిగా డ్రగ్స్ దందా జరుగుతోందన్నారు. విదేశీ మాదక ద్రవ్యాలతో పాటు, కొకైన్లు విచ్చల విడిగా తెచ్చి భాగ్య నగరంలో డ్రగ్స్ దందా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
తమ ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను లాజిస్టిక్స్(కార్గో) సేవలను టీజీఎస్ఆర్టీసీ మరింతగా విస్తరిస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందులో భాగంగానే రాజధాని హైదరాబాద్ లో వేగవంతమైన సేవలను అందించేందుకు హోం డెలివరీ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.. అనేక బస్తీలు, హైదరాబాద్ చుట్టుపక్కల కాలనీలలో ఓపెన్ డ్రైనేజీ ఉంది.. ఇంత వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
స్క్వాడ్రన్ లీడర్ జయసింహ నేతృత్వంలోని ఘనంగా ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్, వైరల్పే ద్వారా స్పాన్సర్ చేయబడిన 15వ ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్షిప్ను అక్టోబర్ 20, 2024న హైదరాబాద్లో విజయవంతంగా నిర్వహించింది. ఈ ఛాంపియన్షిప్లో 3 దేశాలు, 13 రాష్ట్రాలు, 59 నగరాలు , 74 పాఠశాలల నుండి 180 మంది పాల్గొన్నారు.
MNJ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో హైదరాబాదులోని లుంబిని పార్క్ నుంచి ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి వరకు నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ అండ్ వాక్ ను రాష్ట్ర వైద్యారోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు.
Shamshabad-Vizag Train: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించే ప్రాజెక్టు ప్రణాళిక కీలక దశకు చేరుకుంది. శంషాబాద్- వైజాగ్ మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్మెంట్ ఫిక్స్ అయింది.
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీ ఈరోజు (శనివారం) జరుగబోతుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనుంది.
ఉదయం నుండి సాయంత్రం వరకు బీజేపీ ఆధ్వర్యంలో మూసీ బాధితుల పక్షాన ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసిన అనంతరం ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు లంకల దీపక్ రెడ్డి, డాక్టర్ పుల్లారావు యాదవ్ లతో కలిసి నీలోఫర్ కేఫ్ కు వచ్చారు.
పనుల్ని ఎండీ అశోక్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల నుంచి కాండూట్ కు లీకేజీ సమస్య ఉందని, ప్రజలకు సరఫరాలో ఇబ్బంది వస్తుందని పనుల వాయిదా వేస్తు్న్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో చారిత్రాత్మక గండిపేట్ కాండూట్ ను పదేళ్లుగా వేధిస్తున్న లీకేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందన్నారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి అప్పీల్ చేస్తున్న, డిమాండ్ చేస్తున్నాం పేదల ఇండ్లను కూల్చోద్దు అని ఆయన అన్నారు. మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే మూసీ సుందరీకరణ ను తెర మీదకు తెచ్చారని, సిగ్గులేకుండా ప్రభుత్వం పేద ప్రజల ఇండ్లను కూల్చుతోందన్నారు కిషన్ రెడ్డి.