అక్రమ పటాకుల నిల్వలే హైదరాబాద్‌లో ప్రమాదాలకు కారణమని జిల్లా ఫైర్ అధికారి వెంకన్న వెల్లడించారు. అక్రమ గోదాంలపై నిఘా కొనసాగుతోందన్నారు. వెండర్స్ నకిలీ క్రాకర్స్ అమ్మకాలు జరపొద్దని.. లేబుల్ ఉన్న క్రాకర్స్ మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. నివాసం, సముదాయాల ప్రాంతాల్లో క్రాకర్స్ దుకాణాలకు అనుమతి లేదన్నారు.
మూడు సంవత్సరాల బాలికను కిడ్నాప్‌కు పాల్పడిన యువకుడిని బండ్లగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండ్లగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అల్ జుబేల్ కాలనీకి చెందిన సోహైల్ (25) బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ రోజ్‌గార్ మేళాలో భాగంగా నేడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను ప్రధాని, కేంద్ర మంత్రులు నేడు అందజేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 51 వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 155 మందికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు.
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెయిన్ బజార్‌లోని ఇంట్లో నిల్వ ఉంచిన టపాసులు ఒక్కసారిగా పేలాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. దీపావళి పండుగ సందర్భంగా ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో బాణాసంచాను నిల్వ ఉంచారు.
కొడుకు చనిపోయిన విషయం తెలియక మూడు రోజుల పాటు అంధకారంలోనే ఉండిపోయారు అంధ తల్లిదండ్రులు. మనసును కలచివేసే ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని నాగోల్‌లో చోటుచేసుకుంది. కొడుకు మృతి నాగోల్‌లో అంధ తల్లిదండ్రులకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. కుమారుడు మృతి చెందిన విషయం తెలియని పరిస్థితిలో మూడు రోజుల పాటు తిండి, తిప్పలు లేక ఆ అంధ వృద్ధ దంపతులు అవస్థలు పడ్డారు.
టపాసుల దుకాణ దారులు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. అబిడ్స్ బొగ్గులకుంటలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైన క్రాకర్స్ దుకాణ ప్రాంతాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన క్రాకర్స్ దుకాణాన్ని ఆ పక్కనే ఆహుతి అయిన టిఫిన్ సెంటర్‌ను పరిశీలించి ప్రమాదానికి కారణాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు ఏవీ రంగనాథ్.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా గతంలో పనిచేసిన అమోయ్ కుమార్ పై రంగారెడ్డి జిల్లా వట్టినపులపల్లిలోని... శంకర్ హిల్స్ ప్లాట్స్ పర్చేజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 1983లో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టి నాగులపల్లిలోని 460 ఎకరాల్లో... 3,333 ప్లాట్లను కొనుగోలు చేశామని అసోసియేషన్ సభ్యులు లక్ష్మీ కుమారి, కృష్ణారెడ్డి లు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో నెల రోజుల పాటు పోలీస్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం ఉందన్నారు.
హైదరాబాద్‌లోని నందినగర్‌లో విషాదం చోటుచేసుకుంది. నంది నగర్లో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందగా.. మరో 20 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తు్న్నారు. నందినగర్‌లో వారాంతపు సంతలో పెట్టిన మోమోస్‌ను బాధితులు తిన్నట్లు తెలిసింది.