మియాపూర్ మెట్రోస్టేషన్ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత సంచరిస్తోందని తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన స్కిల్స్ యూనివర్సిటీని ఈ ఏడాది నుంచే ప్రారంభించిన విషయం తెలిసిందే. లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, హెల్త్కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ అడ్మిషన్ ప్రక్రియ పూర్తైంది.
హైదరాబాద్ నగరంలో కుళ్ళిపోయిన చికెన్ అమ్ముతున్న గోడౌన్ పై టాస్క్ఫోర్స్ పోలీసులు, జీఎస్ఎంసీ అధికారులు దాడులు నిర్వహించారు. కుళ్లిపోయిన 200 కేజీల చికెన్, గోడౌన్ను అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా.. గోడౌన్ కు సంబంధించి అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేవు. బేగంపేట్, ప్రకాష్ నగర్ చికెన్ గోడౌన్లలో టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు దాడులు చేసి, తనిఖీలు నిర్వహించారు.
యువకులకు చేష్టలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. వారి ప్రవర్తన వల్ల సాధారణ జనాలు ఇబ్బందులు పడుతున్నారు. వారి ఆగడాలను అడ్డుకునేందుకు యత్నిస్తే ప్రాణం తీసేందుకు కూడా వెనకాడటం లేదు.
KTR Viral Tweet: రాష్ట్రానికి పైసా లేదు, లాభం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పది నెలల్లో 25 సార్లు ఢిల్లీకి వెళ్లారని..
IT Rides: హైదరాబాద్లో ఐటీ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. తాజాగా నగరంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 30 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Kidnap Murder Case: హైదరాబాద్ లోని సూరారంలో తల్లిని అనుభవించాలన్న కోరికతో ఆమె కూతురిని హత్య చేసిన ఘటనలో ‘తిరుపతి’ అనే యువకుడిని అరెస్ట్ చేసారు పోలీసులు. బాలికని హత్య చేస్తే తల్లిని అనుభవించవచ్చునని కోరికతో హత్య చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా మరణించిన బాలిక మరొక సోదరితో పాటు సహజీవనం చేస్తున్న యువకుడ్ని కూడా చంపాలని ప్లాన్ చేసాడని, అలా చేస్తే బాలిక తల్లికి ఎవరు లేకపోతే తన దగ్గరకు వస్తుందని తిరుపతి ఆశించినట్లు అధికారులు…
Mahatma Gandhi: హైదరాబాద్ లోని ప్రగతినగర్ అంబేరుచెరువు దగ్గర మహాత్ముడికి అవమానం జరిగింది. గాంధీ జయంతి నాడు హడావిడిగా విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రారంభించారని., జన సంచారం లేని ప్రదేశంలో హడావిడిగా గాంధీ విగ్రహం ఏర్పాటు అవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చీకటి పడితే మందుబాబులకి అడ్డాగా మారిన ఆ ప్రదేశంలో విగ్రహం ఎందుకు ఏర్పాటు చేసారంటూ ప్రజలు ఆగ్రహిస్తున్నారు. కేవలం పబ్లిసిటీ కోసం గాంధీ పరువు కాంగ్రెస్ లీడర్లు తీస్తున్నారని, మందు బాబుల్ని నియంత్రించడం…
హైదరాబాద్లో వరుస క్రైమ్లో ఆందోళన కలిగిస్తున్నాయి.. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది.. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు.. గచ్చిబౌలిలో ఈ ఘటన చోటు చేసుకుంది.. అర్ధరాత్రి సమయంలో ఆటో వెళ్తున్న యువతిపై కన్నేసిన కామాంధులు.. ఆటోలోనే ఆమెపై అత్యాచారాకి ఒడిగట్టారు.
Rajendra Nagar: హైదరాబాద్లో గంజాయి విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా వీరి కార్యకలాపాలకు అడ్డుకట్ట పడడం లేదన్న విమర్శలున్నాయి. మరికొన్ని చోట్ల గంజాయి సేవించేవారు ముఠాగా ఏర్పడి బీభత్సం సృష్టిస్తున్నారు. గంజాయి మత్తులో రోడ్లపైనే భయాందోళన వాతావరణం సృష్టిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వారిపై దాడికి పాల్పడ్డారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. గంజాయి మత్తులో మార్నింగ్ వాకింగ్ చేస్తున్న వారిపై తెల్లవారుజామున దాడి చేశారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ గూడ…