AA23: హీరోయిన్ లేదు.. రొమాన్స్ లేదు! బన్నీ కెరీర్లోనే అతిపెద్ద ప్రయోగంగా ‘AA23’?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AA23: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘AA23’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రతో పాటు రొమాంటిక్ ట్రాక్ కూడా ఉండదని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని పూర్తిగా యాక్షన్ స్టోరీతో తెరకెక్కించనున్నట్లు టాక్. కథలో ప్రధానంగా యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కే ప్రాధాన్యం ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
ఈ ప్రచారం నిజమైతే, అల్లు అర్జున్ కెరీర్లో ఇది అత్యంత విభిన్నమైన, సాహసోపేతమైన ప్రాజెక్ట్‌గా నిలవనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. స్టార్ హీరో సినిమా అంటే తప్పనిసరిగా హీరోయిన్, లవ్ స్టోరీ, పాటలు ఉంటాయనే ఫార్ములాకు భిన్నంగా ఈ చిత్రం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ‘ఖైదీ’, ‘విక్రమ్’ వంటి చిత్రాల్లో హీరోయిన్ లేకుండా రొమాంటిక్ సినిమా ట్రాక్ లేకుండానే భారీ సక్సెస్ అందుకున్న లోకేష్ కనగరాజ్.. అదే తరహా ఫార్ములాను ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకూ అనుసరిస్తున్నారనే ప్రచారం మరింత ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పుష్పా సినిమాతో నేషనల్ వైడ్‌గా ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్లో రాకా చిత్రం చేస్తుండగా, ఇదే సమయంలో లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సమాచారంతో ఈ ప్రాజెక్ట్‌పై బన్నీ అభిమానులతో పాటు సినిమా వర్గాల్లోనూ ఈ చిత్రంపై ప్రత్యేకమైన బజ్ క్రియేట్ అయ్యింది.
Also Read
- Ajay Bhupathi: 'శ్రీనివాస మంగాపురం'లో ఆ పవర్ఫుల్ పాత్ర కోసం మొదటి నుంచి ఆయనే అనుకున్నా..
- Mrunal Thakur and Yashasvi Jaiswal: మృణాల్ ఠాకూర్–యశస్వి జైస్వాల్ డేటింగ్..! వైరల్ వీడియోతో మొదలైన కొత్త చర్చ..
- Ranbir Kapoor: నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ కింగ్ రణబీర్ కపూర్ అవుతాడా?
- Salman Khan: సల్మాన్‌కు ఊరట.. 'బ్లాక్ బక్' టీజర్ తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం!
తాజావార్తలు
-
AA23: హీరోయిన్ లేదు.. రొమాన్స్ లేదు! బన్నీ కెరీర్లోనే అతిపెద్ద ప్రయోగంగా ‘AA23’?
-
IndiGo Flight: దుబాయ్-ముంబై ఇండిగో విమానంలో మంటలు.. రాజ్‌కోట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Supreme Court: రామ మందిర విరాళాల చోరీ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Ajay Bhupathi: ‘శ్రీనివాస మంగాపురం’లో ఆ పవర్ఫుల్ పాత్ర కోసం మొదటి నుంచి ఆయనే అనుకున్నా..
-
TDP Governor Quota MLC Race: రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. 20 మందికిపైగా ఆశావహులు.. టీడీపీలో ఆసక్తికర సమీకరణాలు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!