Tollywood: అన్నీ మేమే చేయాలంటున్న హీరోలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో అంటే బెస్ట్ యాక్టింగ్ తో ఆకట్టుకోవాలి. ఇప్పుడు మాత్రం యాక్టింగ్ తో పాటు మల్టీ టాలెంట్స్ చూపిస్తున్నారు కొందరు హీరోలు. పాటలు పాడేస్తున్నారు, లిరిక్స్ రాసేస్తున్నారు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా చూసుకుంటున్నారు. ఇది నిజంగానే ప్యాషన్ తోనా లేక సినిమా మీద ఎక్స్ట్రా బజ్ తీసుకురావడానికి చేస్తున్న ప్రయోగమా? ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో హీరోల్లో కనిపిస్తున్నటువంటి ఈ ట్రెండ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
కమల్ హాసన్, పవన్ కళ్యాణ్ లాంటి కొంతమంది హీరోలు మాత్రమే మల్టీ టాలెంట్స్ చూపించేవారు. కానీ ఇప్పుడు యంగ్ హీరోస్ కూడా చాలా మంది అదే దారిలో నడుస్తున్నారు. స్టార్ హీరో సూర్యకు ఇప్పటికే తమిళంలో ఆరేడు సాంగ్స్ పాడిన ఎక్స్పీరియన్స్ ఉంది. తాజాగా విశ్వనాథన్ అండ్ సన్స్ సినిమాలో తెలుగు ప్రేక్షకుల కోసం ఓ వెడ్డింగ్ సాంగ్ పాడి సర్ప్రైజ్ ఇచ్చాడు. సినిమా రిలీజ్ కాకముందే హీరో పాడిన పాట అనే క్యూరియాసిటీని ఆడియన్స్ లో పెంచేసింది. ఇక ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని, ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో “నువ్వుంటే చాలే” అనే పాటకు లిరిక్స్ రాసి తనలోని మరో టాలెంట్ ని బయట పెట్టాడు. అక్కడితో ఆగలేదు; ఇప్పుడు తన 23వ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతలన్నీ తనే తీసుకుంటున్నాడు. ఇది కేవలం ఎక్స్పెరిమెంటా లేక తన విజన్ ని స్క్రీన్ మీద పూర్తి స్థాయిలో చూపించాలి అనే ప్యాషనా అనే చర్చ ఆడియన్స్ లో మొదలయింది.
Also Read
- Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
- Shavukaru Janaki : వెండితెర 'షావుకారు' జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
- Arjun Reedy Ice Scene: 'ఐస్ వేసుకునే సీన్' రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
- Spirit: 'స్పిరిట్'లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
ఇక యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా అదే రూట్లో వెళ్తున్నాడు. రీసెంట్ గా విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మిశ్రమ స్పందనతో థియేటర్లలో రన్ అవుతుంది. తన తదుపరి సినిమాకు హీరోగా నటించడమే కాదు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా తానే వహిస్తున్నాడు. ఇప్పుడు హీరో సుధీర్ బాబు సైతం అదే బాటలో పయనిస్తూ తన కోసం ఒక కథ రాసుకుని దాన్ని డైరెక్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కొత్త టాలెంట్ ని ట్రై చేయాలి అనే కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు యంగ్‌స్టర్స్ సేఫ్ జోన్ కంటే క్రియేటివ్ జోన్ ని ఎక్కువగా బిలీవ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.
అయితే ఈ ట్రెండ్ కి ఇన్స్పిరేషన్ కొత్తది కాదు. కమల్ హాసన్ మంచి నటుడు మాత్రమే కాదు; సింగర్, లిరిక్ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా అన్ని రంగాల్లో తన మార్కు చూపిస్తున్నాడు. ధనుష్ కూడా అదే దారిలో “వై దిస్ కొలవెరి డి” అంటూ పాటలు పాడి చాట్ బస్టర్స్ ఇచ్చాడు. పా పాండి, రాయన్, ఇడ్లీ కడై, నిలవుక్కు ఎన్మేల్ ఎన్నడి కోపం వంటి సినిమాలు తెరకెక్కించి తన విజన్ చూపించాడు. ఇప్పుడు సూర్య, రామ్, కిరణ్ అబ్బవరం, సుధీర్ బాబు లాంటి హీరోలు కూడా తమ హిడెన్ టాలెంట్స్ ని బయటకి తీసుకొస్తున్నారు. కానీ అసలు క్వశ్చన్ ఒక్కటే, ఇది సినిమా ప్రమోషన్ స్ట్రాటజీనా? రేపటి కంప్లీట్ ఫిల్మ్ మేకర్స్ గా ఎదగాలి అనే ప్యాషనా? లేక వీరు కావాలనుకున్నంత టాలెంట్ దర్శకుల దగ్గర ఉండడం లేదా ఆమె ఆన్సర్ మాత్రం ఆడియన్స్ యాక్సెప్టెన్స్, బాక్స్ ఆఫీస్ రిజల్ట్ అండ్ టైమ్ మాత్రమే డిసైడ్ చేస్తాయి.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!