క్యాబ్లో ఎక్కే జంటలతో ఎంత విసుగుపోయాడో.. ఏంటో తెలియదు గానీ.. ఓ క్యాబ్ డ్రైవర్ సంచలన నిర్ణయమే తీసుకున్నాడు. తన క్యాబ్లో శృంగారానికి చోటు లేదంటూ వార్నింగ్ బోర్డు ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన హెచ్చరిక బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం… హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్ లో ఉన్న ఈ ఆలయం ప్రముఖ, ప్రాచీన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవీగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా, ఆషాడ మాసం వంటి పండుగలను ఈ ఆలయంలో అత్యంత భక్తితో నిర్వహిస్తారు. ఈ ఆలయం ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానానికి ఎదురుగా ఉంది. ఫిల్మ్ నగర్ బస్ స్టాప్ నుండి నడిచి వెళ్లేంత దూరంలోనే ఉంటుంది. అనేక మంది ప్రఖ్యాతులైన వ్యక్తులు,…
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు సోమవారం నుంచి జరుగుతున్నాయని.. ఈ పరీక్షల కోసం ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాలయాపనకు ఫుల్స్టాప్ పెట్టాలని ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామన్నారు. గ్రూప్ 1 పరీక్షలు కచ్చితంగా నిర్వహిస్తామన్నారు. కొంతమంది ఉద్యోగాలు పోవడంతో వాళ్లు ఆందోళన చేస్తున్నారని సీఎం వెల్లడించారు.
ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నదుల్లో మూసీ ఒకటి. ఇప్పుడు దీన్ని పూర్తిగా మార్చేయాలనుకుంటోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆక్రమణలతో అన్యాక్రాంతమైపోయిన ఈ నదికి పునరుజ్జీవం కల్పించాలనుకుంటోంది. లండన్ లోని థేమ్స్ నది, సియోల్ లోని చియోంగ్ జియోన్ నది లాగా దీన్ని సుందరీకరించాలనుకుంటోంది. మరి దీనిపై వివాదం ఎందుకు..? మూసీ నది చరిత్రేంటి..? ఎందుకిలా తయారైంది..? తెలంగాణలో మూసీ నదికి ఘన చరిత్ర ఉంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ నది పేరు కూడా ఎత్తలేని…