OnePlus 16 లీక్స్ వైరల్.. 9,000mAh భారీ బ్యాటరీ, సరికొత్త ఫీచర్లతో భారీ అంచనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ తన తదుపరి ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 16ను 2026 అక్టోబర్‌లో విడుదల చేసే అవకాశమున్నట్లు తాజా లీకులు సూచిస్తున్నాయి. కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఈ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు సోషల్ మీడియాలో, టెక్ వర్గాల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఇందులో ఉండొచ్చని ప్రచారం జరుగుతున్న 9,000mAh బ్యాటరీ టెక్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
లీక్‌లు ఏం చెబుతున్నాయి..?
లీకుల ప్రకారం, వన్‌ప్లస్ 16లో సిలికాన్-కార్బన్ టెక్నాలజీ ఆధారిత 9,000mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు ప్రధాన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లలో ఇంత పెద్ద బ్యాటరీ కనిపించలేదు. బ్యాటరీ సామర్థ్యం పెరిగినా, ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ తక్కువ సమయంలోనే ఫోన్ పూర్తిగా ఛార్జ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Also Read
- Vivo T5e: వివో T5e స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. 48% తగ్గింపుతో రూ.13,999కే.. 5500mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లే
- Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
- Airtel నుంచి 'Buy 1 Get 1' ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
- Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
పనితీరులోనూ కీలక మార్పులు..!
పనితీరు పరంగా కూడా వన్‌ప్లస్ 16లో కీలక మార్పులు ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి. ఈ ఫోన్లో క్వాల్కామ్ నుంచి రానున్న Snapdragon 8 Elite Gen 6 Pro ప్రాసెసర్‌ను ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. ఈ చిప్సెట్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు, హై-ఎండ్ గేమింగ్, మల్టీటాస్కింగ్, పవర్ ఎఫిషియెన్సీ మరింత మెరుగుపడే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
డిస్ప్లే కోసం కొత్త టెక్నాలజీ..
డిస్ప్లే విషయంలో కూడా వన్‌ప్లస్ కొత్త టెక్నాలజీని ఉపయోగించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. 6.78 అంగుళాల ఫ్లాట్ డిస్ప్లే, అత్యంత సన్నని మరియు సమానమైన బెజెల్స్‌తో అందుబాటులోకి రావచ్చని సమాచారం. ఇందుకోసం LIPO డిస్ప్లే ప్యాకేజింగ్ టెక్నాలజీను ఉపయోగించే అవకాశం ఉందని లీకులు పేర్కొంటున్నాయి. దీని వల్ల ఫోన్ మరింత ప్రీమియం లుక్‌తో పాటు మెరుగైన విజువల్ అనుభూతిని అందించవచ్చని అంచనా.
200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా..
కెమెరా విభాగంలో పెద్దగా డిజైన్ మార్పులు లేకపోయినా, ఫోటోగ్రఫీ పరంగా అప్గ్రేడ్లు ఉండే అవకాశం కనిపిస్తోంది. వన్‌ప్లస్ 15 తరహాలోనే స్క్వేర్ కెమెరా మాడ్యూల్ కొనసాగవచ్చని సమాచారం. అయితే, 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను ఇందులో అందించే అవకాశమున్నట్లు గత లీకులు వెల్లడించాయి. ఇది నిజమైతే జూమ్ ఫోటోగ్రఫీ, లాంగ్-రేంజ్ ఇమేజ్ క్వాలిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉంది.
అయితే, వన్‌ప్లస్ 16 విడుదల తేదీ, ఫీచర్లు లేదా స్పెసిఫికేషన్లపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన సమాచారం మొత్తం లీకులు, టెక్ నివేదికల ఆధారంగానే ఉంది. కాబట్టి ఇవన్నీ అధికారిక ప్రకటన వచ్చే వరకు ఊహాగానాలుగానే పరిగణించాలి. అయినప్పటికీ, ఈ లీకులు నిజమైతే బ్యాటరీ, పనితీరు, డిస్ప్లే, కెమెరా వంటి కీలక అంశాల్లో వన్‌ప్లస్ 16 కంపెనీ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచే అవకాశం ఉందని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ ఫోన్ లాంచ్‌పై ప్రపంచవ్యాప్తంగా వన్‌ప్లస్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Anirudh-Kavya Wedding: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లికి వేళాయే.. వివాహం తేదీ, స్థలం, పూర్తి వివరాలు ఇవే..
-
Keesara SI: కీసర పీఎస్‌లో ఆగని లంచావతారాలు.. రూ.2 లక్షలతో ఏసీబీకి చిక్కిన ఎస్సై శ్రీనివాస్!
-
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం.!
-
Arjun Ram Meghwal: బీఎస్ఎఫ్ జవాన్లతో దీపావళి సంబరాలు.. కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం!
ట్రెండింగ్
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!