రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా హైదరాబాద్, పాతబస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.
భాగ్యనగర ప్రజలు మళ్లీ ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొవాల్సిందే. రానున్న పది రోజులు వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు మరింతగా పెరగనున్నాయి. సమీప ప్రాంతాల్లో ముఖ్యమైన పలు ఈవెంట్ల ఫలితంగా ఆయా మార్టాల్లో ట్రిఫిక్ ను మళ్లించేందుకు హైదరాబాద్ ట్రిఫిక్ పోలీసులు వాహనాలను మళ్లించడం వల్ల ఇరుకు రోడ్లలో చిక్కుకుపోయి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
Hyderabad Traffic: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Hyderabad Traffic Alert : హైదరాబాద్‌లో నేటి నుంచి 40 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. నగరంలోని అంబర్‌పేటలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబర్‌పేట టీ జంక్షన్ వరకు రోడ్డు మూసేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
Hyderabad Traffic: హైదరాబాద్ నగరంలోని బేగంపేట పరిధిలో రసూల్‌పురా- రాంగోపాల్‌పేట మధ్య నాలా పునరుద్ధరణ పనుల నేపథ్యంలో నేటి నుంచి మూడు నెలలపాటు ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.
Command and Control Centre inauguration-Traffic advisory issued: హైదరాబాద్ నగరానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రేపు ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గురువారం ప్రారంభం కానుంది. రూ. 600 కోట్ల వ్యయంతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ని మంగళవారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమీక్షించారు. పలువురు వీఐపీలు హాజరవుతుండటంతో భద్రతా పరమైన…
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. ఒళ్లు కాలి మరొకడు ఏడ్చాడని వెనుకటికి ఒక సామెత ఉంది. ఇప్పుడు ఈ సామెత హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్‌కు సరిగ్గా సరిపోతుంది. ఉన్నోడు కార్లలో తిరుగుతూ ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతుంటే.. లేనోడు బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణిస్తూ ట్రాఫిక్జామ్లలో ఇరుక్కుపోయి నానా అవస్థలు పడుతున్నాడు. ట్రాఫిక్‌జామ్‌కు భారీ వర్షాలే కారణమని వాదించవచ్చు. కానీ అది 30 శాతం మాత్రమే. మిగతా 70 శాతం నానాటికీ పెరుగుతున్న కార్ల ట్రాఫిక్‌ను ప్రభుత్వాధికారులు అదుపు చేయలేకపోవడం…
హైదరాబాద్నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముస్లిం సోదరులకు తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న ఇఫ్తార్ విందులో ముస్లింలు, మత పెద్దలు…
తెలంగాణలో పెండింగ్ ఛలాన్లు క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రవేశపెట్టిన డిస్కౌంట్ విధానానికి భారీ ఎత్తున స్పందన వస్తోంది. దీంతో తొలిరోజే 5 లక్షల ట్రాఫిక్ ఛలాన్లు క్లియర్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఏకంగా రూ.600 కోట్ల పై చిలుకు ట్రాఫిక్ ఛలాన్లు పేరుకుపోయి ఉన్నాయి. అందుకే ట్రాఫిక్ పోలీసులు రిబేట్ ప్రకటించారు. అయితే తొలి రోజు లక్ష నుంచి 3 లక్షల మంది వరకు వాహనదారులు ట్రాఫిక్ ఛలాన్లు…