HYD : హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 1/12లో మంగళవారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. భారీ వర్షాల ప్రభావంతో రోడ్డు ఆకస్మాత్తుగా కుంగిపోవడంతో, ఆ మార్గంలో వెళ్తున్న వాటర్ ట్యాంకర్ గుంతలో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ , క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు , జీహెచ్ఎంసీ సిబ్బంది గాయపడిన వారిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.…
Hyderabad Rains Trigger Massive Traffic Jam: తూర్పు, పశ్చిమ ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రధాన రోడ్లపై నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర…
New Traffic Rules: హైదరాబాద్ నగరంలో త్వరలో కొత్త ట్రాఫిక్ రూల్స్ రాబోతున్నాయి.. దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఒక వైపు వాహనాల వేగం పెరిగింది.. 24 నుంచి 26 కిలోమీటర్లు వాహనాలు హైదరాబాద్ రోడ్ల మీద పరుగులు పెడుతున్నాయని తెలిపారు.
ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. మంగళ్ హాట్ సీతారాం భాగ్ నుంచి ప్రారంభం కానున్న ఈ శోభాయాత్ర మధ్యాహ్నం 1 గంటకు ర్యాలీగా బయలుదేరనుంది. సీతారాం భాగ్ నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యయం శాలకు శోభాయాత్ర చేరుకోనుంది. మొత్తం 3.8 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనుంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో నగర పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు…
Kishan Reddy : స్థానిక పార్లమెంట్ సభ్యుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశంతో అంబర్పేట్ ఫ్లైఓవర్ పై రాకపోకలు ప్రారంభమయ్యాయి. అంబర్పేట్ ఫ్లై ఓవర్ పై నేటి నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశంతో అంబర్పేట్ ఫ్లైఓవర్‌పై రాకపోకలు కొనసాగుతున్నాయి. దాదాపుగా ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. అయితే కింద భాగాన రోడ్డు నిర్మాణం, గ్రీనరీ, బ్యూటిఫికేషన్ కార్యక్రమాలను పూర్తి చేసి అధికారికంగా మరికొన్ని రోజుల్లో ఫ్లైఓవర్ ప్రారంభించనున్నారు. అంతవరకు సౌకర్యార్థం…
GHMC Tender: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ పెరుగుతున్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కింద ఏడు స్టీల్ బ్రిడ్జిలు, ఏడు అండర్ పాస్‌లు నిర్మించనున్నారు. మొత్తం రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. హెచ్సిటి (H-City) ప్రాజెక్టులలో భాగంగా నగరంలోని పలు ప్రధాన రహదారుల్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మాణానికి ప్రభుత్వం…
Footpath Encroachment : రంగారెడ్డిలోని బండ్లగూడలో మునిసిపల్ అధికారులు ఫుట్‌పాత్ ఆక్రమణలపై కొరడా ఝుళిపించారు. ఫుట్ పాత్‌పై వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పాదచారులు నడిచే పుట్ పాత్ ను ఆక్రమించుకొని వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేశారు వ్యాపారస్తులు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అదేశాల మేరకు బండ్లగూడ జాగీర్ మునిసిపల్ అధికారులు రంగంలోకి దిగారు. గత కొన్ని సంవత్సరాలుగా ఫుట్ పాత్ కబ్జా చేసి వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో…
ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు రాయితీపై ట్రాఫిక్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ఎలాంటి రాయితీ లేదని స్పష్టం చేశారు.
మద్యం సేవించి వాహనం నడపడం చాలా ప్రమాదకరమైన చర్య. మద్యం మనం కళ్లతో చూస్తున్నదానిపై కూడా ప్రభావం చూపుతుంది, మన మస్తిష్కాన్ని, నాడీ వ్యవస్థను క్రమంగా ప్రభావితం చేస్తుంది. ఇది మన అవగాహనను తగ్గించి, మనం తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది.