Hyderabad New Traffic Rules :హెల్మెట్ లేకుండా, రాంగ్ సైడ్ డ్రైవింగ్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం నుంచి భారీ స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించనున్నారు. హెల్మెట్ లేకుండా, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల గత మూడు రోజుల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళతో సహా ముగ్గురు మరణించారని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) పి విశ్వ ప్రసాద్ తెలిపారు. అలాగే, ఈ మూడు కేసుల్లోనూ బాధితులు రక్షణ…
హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు పుల్ స్టాప్ కు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే జంట కమిషనర్ల పరిధిలో సమన్వయ కమిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. 3 పోలీస్ కమిషనర్ల తో కలిపి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ట్రాఫిక్ తో పాటు ఇతరత్రా సమస్యలపై సమన్వయ కమిటీ చర్చించనుంది. ట్రాఫిక్ నియంత్రణ రోడ్ల అభివృద్ధిపై ప్రధానంగా కమిటీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైడ్రా తోపాటు పోలీసు కమిషనర్లతో కమిటీ ఏర్పాటు రంగం…
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, అమీర్ పేట్, గండిపేట్, తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
Traffic in Hyderabad: నల్లకుంట, మాసాబ్ ట్యాంక్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అబిడ్స్ వరకు గణేష్ విగ్రహాలు క్యూ కట్టారు. దీంతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Khairatabad Ganesh: హైదరాబాద్ నగరంలో అతిపెద్ద వినాయకుడు. ఖైరతాబాద్ వినాయకుడు. ఆయనను దర్శించుకునేందుకు నగర ప్రజలు పోటెత్తారు. సాధారణ రోజుల్లో ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతుంటే.. సెలవంటే ఎలా? ఆదివారం ఖైరతాబాద్‌కు ఇసుకలా జనం తరలివచ్చారు.
Hyderabad Traffic: హైదరాబాద్ వాసులకు భారీ హెచ్చరిక. ఈరోజు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిబంధనల ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. నిబంధనలు ఉల్లంఘిస్తూ పలువురు వాహనదారులు పట్టుబడ్డారు.
Traffic restrictions: హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలర్ట్ గా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.