Hyderabad Traffic: బిగ్ అలర్ట్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Traffic: హైదరాబాద్ వాసులకు భారీ హెచ్చరిక. ఈరోజు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో లాయల్ ట్యాంక్‌బండ్‌లోని కట్ట మైసమ్మ దేవాలయం, ఆర్టీసీ క్రాస్ రోడ్ల మధ్య ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమలులో ఉంటాయి. ఈ మేరకు హైదరాబాద్ నగర అదనపు ట్రాఫిక్ కమిషనర్ సుధీర్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఇందిరాపార్క్ వరకు ఎక్స్ రోడ్ వైపు ట్రాఫిక్ అనుమతించబడదు. వాహనదారులు లోయర్ ట్యాంక్‌బండ్, ఎమ్మార్వో కార్యాలయం, స్విమ్మింగ్ పూల్ మరియు కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఇందిరా పార్క్ ఎక్స్ రోడ్ వైపు వెళ్లాలి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కట్ట మైసమ్మ దేవాలయం వైపు వచ్చే ట్రాఫిక్‌కు ప్రవేశం లేదు. ఇంటిపార్క్ ఎక్స్ రోడ్డు వద్ద బండ మైసమ్మ, స్విమ్మింగ్ పూల్, తహసీల్దార్ కార్యాలయం, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు వాహనాలను మళ్లిస్తారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలని పోలీసులు సూచించారు.
Read also: Ram Charan: స్పీడ్ పెంచిన మెగా పవర్ స్టార్… 6 నెలల్లో రెండు సినిమాలు!
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
స్టీల్ బ్రిడ్జ్ ప్రత్యేకతలు..
దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి ఇదేనని ప్రభుత్వం చెబుతోంది. ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు మొత్తం 2.62 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఇది మొత్తం 81 స్తంభాలతో నిర్మించబడింది. రూ. 450 కోట్లతో నిర్మాణానికి వెచ్చించారు. ఎస్‌ఆర్‌డిపి కింద నగరంలో నిర్మించిన 20వ ఫ్లైఓవర్ ఇది. దీనికి తెలంగాణ తొలి హోంమంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టారు. ఈ ఫ్లై ఓవర్ ద్వారా విద్యానగర్, ఉప్పల్, నల్లకుంట వెళ్లే ప్రజల ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. ఈ ఉక్కు వంతెనను ఇవాళ ఉదయం 10.30 గంటలకు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
Ladies Special Bus: కోఠి- కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్.. ఈ నెల 21 నుంచి 127K నెంబర్..
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!