Hyderabad Traffic: భాగ్యనగర ప్రజలు మళ్లీ ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొవాల్సిందే. రానున్న పది రోజులు వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు మరింతగా పెరగనున్నాయి. సమీప ప్రాంతాల్లో ముఖ్యమైన పలు ఈవెంట్ల ఫలితంగా ఆయా మార్టాల్లో ట్రిఫిక్ ను మళ్లించేందుకు హైదరాబాద్ ట్రిఫిక్ పోలీసులు వాహనాలను మళ్లించడం వల్ల ఇరుకు రోడ్లలో చిక్కుకుపోయి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అయితే.. ఇప్పటికే గత మూడు రోజులుగా నగర ప్రజలను ట్రాఫిక్ ఆంక్షలు ఇబ్బంది పెడుతున్నాయి. కాగా.. మంగళ, బుధవారాలు ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువ అయింది. ఇక.. ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు మెయిన్ రోడ్లు, వీధులూ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. అంతేకాకుండా.. శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి, అసెంబ్లీ మార్గంలో ఆంక్షలు ఉన్నాయి.
Read also: Amit Shah: ఈ నెల 11న అమిత్ షా రాష్ట్ర పర్యటన
దీనితోపాటు ఈ నెల 11న ఫార్ములా – ఈ రేసింగ్, 15 వరకు నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్, 17న కొత్త సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉన్నాయి. ఇక రానున్న 18వ తేదీన శివరాత్రి వేడుకలు ఉంటాయి. ఈనేపథ్యంలో.. మరో 10 రోజులపాటు ట్రాఫిక్ సమస్యలు ఎదురుకానున్నాయి. కాగా.. వాహనదారులు నరకం చూడక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే.. షిఫ్టుల వారీగా ట్రాఫిక్ పోలీసులు 24 గంటలు విధుల్లో ఉన్నప్పటికీ ఫలితం ఉండడం లేదు. ఇదిఇలా ఉండగా.. హైదరాబాద్ లో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై ప్రతిరోజూ సుమారు 17 వేల చలానాలు నమోదవుతుంటాయి. కాగా.. అధిక శాతం నోపార్కింగ్, రాంగ్‌రూట్, ట్రిపుల్‌రైడింగ్, హెల్మెట్ ధరించకపోవటం, అధిక వేగం, మైనర్ల డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవింగ్, నంబరు ప్లేటు, లైసెన్స్ లేనివారే ఉంటున్నారు. దీంతో ప్రధాన మార్గాల్లో ఇష్టానుసారం చేరుతున్న తోపుడుబండ్లు, దుకాణాల వద్ద వాహనాలు నిలపటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వీటిని తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు.
Congress Walkout: శాసనసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్.. ప్లాకార్డులతో నిరసన