Hyderabad Traffic: హైదరాబాద్ నగరంలోని బేగంపేట పరిధిలో రసూల్‌పురా- రాంగోపాల్‌పేట మధ్య నాలా పునరుద్ధరణ పనుల నేపథ్యంలో నేటి నుంచి మూడు నెలలపాటు ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.ఈ విషయాన్ని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. నేటి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని కమిషనర్ తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపు విషయంలోపోలీసులకు సహకరించాలని ఆయన వాహనదారులను కోరారు.
Read Also: Bihar IT Raids: రియల్ ఎస్టేట్ సంస్థపై ఐటీ దాడులు.. రూ.100కోట్లు స్వాధీనం
ట్రాఫిక్ డైవర్షన్ ఇలా ఉంటుంది..
* బేగంపేట ఫ్లైఓవర్ నుంచి కిమ్స్ ఆసుపత్రి, మినిస్టర్ రోడ్, రాణిగంజ్, నల్లగుట్ట, వీపీఎన్‌ఆర్ మార్గ్ వైపు వెళ్లేందుకు రసూల్‌పురా టీ-జంక్షన్ వద్ద యూటర్న్‌కు అనుమతి లేదు. కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, రాణిగంజ్, నల్లగుట్ట వైపు రసూల్‌పుర మీదుగా వెళ్లే వాహనాలు సీటీవో ఫ్లైఓవర్ వరకు వెళ్లి యూటర్న్ తీసుకోవాలి. హనుమాన్ టెంపుల్ నుంచి ఫుడ్‌వరల్డ్, సింధీ కాలనీ, రాంగోపాల్‌పేట ఠాణా, కిమ్స్ హాస్పిటల్ వైపు వెళ్లొచ్చు.
* రాణిగంజ్, నల్లగుట్ట, పీవీఎన్‌ఆర్ మార్గ్ నుంచి వచ్చే వాహనాలను రసూల్‌పుర వైపు అనుమతించరు. అటువైపుగా వచ్చే వాహనాలు రాంగోపాల్‌పేట ఠాణా, సింధికాలనీ, ఫుడ్‌వరల్డ్, హనుమాన్ టెంపుల్ మీదుగా వచ్చి ఎడమవైపు తీసుకుని రసూల్‌పుర వైపు వెళ్లే మార్గముంది.
* సికింద్రాబాద్ వైపు నుంచి కిమ్స్ ఆసుపత్రి వైపు వచ్చే వాహనాలు హనుమాన్ టెంపుల్ నుంచి లెఫ్టుకు తీసుకుని, ఫుడ్ వరల్డ్, సింధీ కాలనీ, రాంగోపాల్‌పేట ఠాణా మీదుగా లెఫ్ట్ కు మళ్లి కిమ్స్ ఆస్పత్రి వైపు వెళ్లవచ్చు. లేదా సీటీఓ ఫ్లైఓవర్ నుంచి లెఫ్ట్ కు తీసుకుని రాణిగంజ్ మీదుగా వచ్చి రైట్ తిరిగి కిమ్స్ చేరుకోవచ్చు.
* అంబులెన్స్‌లు లేదా రోగులను బేగంపేట ఫ్లైఓవర్ వైపు నుంచి కిమ్స్‌కు తీసుకువెళ్లాలంటే సీటీఓ ఫ్లైఓవర్ వరకు వెళ్లి యూటర్న్ తీసుకుని రాంగోపాల్‌పేట ఠాణా నుంచి కిమ్స్ వైపు వెళ్లే వీలుంది. ఇక భారీ వాహనాలు మినిస్టర్ రోడ్ వైపు వెళ్లాలంటే మాత్రం రాణిగంజ్ రూట్లో వెళ్లాలి.
#HYDTPinfo
Commuters, please make a note of traffic diversions in view of Nala Development Programme of GHMC from Rasoolpura to Ramgopalpet PS for 3 months (23-11-2022 to 21-02-2023).@JtCPTrfHyd pic.twitter.com/uzqGWeBIwV— Hyderabad Traffic Police (@HYDTP) November 23, 2022
#HYDTPinfo
Commuters, please make a note of traffic diversions in view of Nala Development Programme of GHMC from Rasoolpura to Ramgopalpet PS for 3 months (23-11-2022 to 21-02-2023).@JtCPTrfHyd pic.twitter.com/Rain6dtGy5— Hyderabad Traffic Police (@HYDTP) November 22, 2022