Command and Control Centre inauguration-Traffic advisory issued: హైదరాబాద్ నగరానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రేపు ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గురువారం ప్రారంభం కానుంది. రూ. 600 కోట్ల వ్యయంతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ని మంగళవారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమీక్షించారు. పలువురు వీఐపీలు హాజరవుతుండటంతో భద్రతా పరమైన…
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. ఒళ్లు కాలి మరొకడు ఏడ్చాడని వెనుకటికి ఒక సామెత ఉంది. ఇప్పుడు ఈ సామెత హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్‌కు సరిగ్గా సరిపోతుంది. ఉన్నోడు కార్లలో తిరుగుతూ ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతుంటే.. లేనోడు బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణిస్తూ ట్రాఫిక్‌జామ్‌లలో ఇరుక్కుపోయి నానా అవస్థలు పడుతున్నాడు. ట్రాఫిక్‌జామ్‌కు భారీ వర్షాలే కారణమని వాదించవచ్చు. కానీ అది 30 శాతం మాత్రమే. మిగతా 70 శాతం నానాటికీ పెరుగుతున్న కార్ల ట్రాఫిక్‌ను ప్రభుత్వాధికారులు అదుపు చేయలేకపోవడం…
హైదరాబాద్నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముస్లిం సోదరులకు తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న ఇఫ్తార్ విందులో ముస్లింలు, మత పెద్దలు…
తెలంగాణలో పెండింగ్ ఛలాన్‌లు క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రవేశపెట్టిన డిస్కౌంట్ విధానానికి భారీ ఎత్తున స్పందన వస్తోంది. దీంతో తొలిరోజే 5 లక్షల ట్రాఫిక్ ఛలాన్‌లు క్లియర్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఏకంగా రూ.600 కోట్ల పై చిలుకు ట్రాఫిక్ ఛలాన్‌లు పేరుకుపోయి ఉన్నాయి. అందుకే ట్రాఫిక్ పోలీసులు రిబేట్ ప్రకటించారు. అయితే తొలి రోజు లక్ష నుంచి 3 లక్షల మంది వరకు వాహనదారులు ట్రాఫిక్ ఛలాన్‌లు…
ట్రాఫిక్ రూల్స్ వాహనదారులకు షాకిస్తున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే… ట్రాఫిక్ రూల్స్ ను పాటించని వారికి కూడా కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 చలాన్లు పెండింగ్ లో ఉన్న వాహనదారులను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు 10 చలాన్ల కంటే ఎక్కువ ఉంటే వారిని స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ ట్రైనిగ్ ఇనిస్టిట్యూట్ కు పోలీసులు పంపిస్తున్నారు. ఈ కౌన్సిలింగ్ లో ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘటనలకు…
టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలు రేపు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గచ్చిబౌలి జంక్షన్ కు సైబర్ టవర్స్ మీదుగా వెళ్లేవారు అయ్యప్ప సొసైటీ సీవోడీ జంక్షన్, దుర్గం చెరువు నుంచి వెళ్లాల్సిందిగా సూచించారు. అంతేకాకుండా కొండాపూర్, ఆర్‌సీపురం, చందానగర్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులు బీహెచ్‌ఈఎల్, నల్లగండ్ల, హెచ్‌సీయూ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దీనితో పాటు హఫీజ్‌పేట, మియాపూర్, కొత్తగూడ నుంచి సైబర్ టవర్స్…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు జస్టిస్ ఎన్వీ రమణ.. రాజ్‌భవన్‌లో ఆయన బస చేస్తున్నారు.. రోజూ పలువురు ప్రముఖులు ఆయనను కలసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిన్న యాదాద్రి వెళ్లి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు ఎన్వీ రమణ దంపతులు.. మరోవైపు, ఇతర ప్రముఖులను కలిసిందేకు ఆయన కొన్ని సార్లు హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు.. ఇవాళ ఎస్ఆర్ నగర్ లోని తన నివాసానికి వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ ను నిలిపివేశారు పోలీసులు.. ఇది గుర్తించిన సీజేఐ..…