Hyderabad Rains: మొంథా తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్‌లో డతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కాగా, మలక్‌పేట్ మెట్రో స్టేషన్ పరిసరాలు పూర్తిగా నీటమునిగాయి. దిల్సుఖ్నగర్ నుంచి మలక్‌పేట్ వైపు వెళ్లే ప్రధాన రోడ్డుపై భారీగా నీరు నిల్వ ఉండటంతో వాహనాల రాకపోకలు తీవ్రంగా అంతరాయమయ్యాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ, హైడ్రా టీమ్‌లు అక్కడికి చేరుకుని డ్రైనేజ్ వ్యవస్థను శుభ్రం చేస్తూ నీటిని బయటకు పంపే పనుల్లో నిమగ్నమయ్యాయి. మన్హోల్స్ తెరిచి వరద…
Hyderabad ORR Tragedy: హైదరాబాద్ లో మరో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడగా, ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది.
Hit And Run Case: హైదరాబాద్ మహా నగరంలోని నార్సింగి పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదర్ షాకోట్ చౌరస్తా దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే, హైదర్ షాకోట్ ప్రాంతానికి చెందిన కృష్ణ అనే వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీకొట్టింది.
RTA Raids: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లాల్లోని పలు కీలక ప్రాంతాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Telangana Bandh: నేడు తెలంగాణ బంద్‌కు బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. అన్ని రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలు బంద్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్ ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.. ఎంజీబీఎస్ నుంచి రోజూ 3500 బస్సుల రాకపోకలు సాగించేవి.. బంద్ నేపథ్యంలో ఒక్క బస్సు కూడా…
గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. సాయంత్రం వేళల్లో మొదలవుతున్న ఈ భారీ వర్షాలు నగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. నిన్న కురిసిన కుండపోత వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
Traffic Diversion : నగరంలో గణేష్ నిమజ్జన మహోత్సవాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీ స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. నేటి (ఆగస్టు 29) నుండి సెప్టెంబర్ 5 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి అర్ధరాత్రి వరకు వాహన రాకపోకలపై పరిమితులు ఉండనున్నాయి. పోలీసుల ప్రకారం, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది. ఈ నేపథ్యంలో…
హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో 50 ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్‌లను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. సెక్యూరిటీ కౌన్సిల్స్ ఆధ్వర్యంలో 100 మంది ట్రాఫిక్ మార్షల్స్ విధులు నిర్వర్తించనున్నారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను బలోపేతం చేయడానికి వంద మంది మార్షల్స్లకు 50 బైక్‌లను సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్ షిప్లో భాగంగా ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడంతో పాటు వాహనాలు సజావుగా, సాఫీగా వెళ్లేందుకు ట్రాఫిక్ పెట్రోలింగ్ బైకులు సహకరించనున్నాయి. పబ్లిక్ ప్రైవేట్…
Hyd Traffic : రాఖీ పౌర్ణమి పండగను స్వగ్రామాల్లో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు నగర వాసులు పెద్ద ఎత్తున బయలుదేరడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. పండగ రద్దీ కారణంగా శనివారం ఉదయం నుంచే రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ శివార్లలోని వనస్థలిపురం, భాగ్యలత, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా మారింది. ఒక్కసారిగా వేల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి రావడంతో ప్రధాన రహదారితో పాటు సర్వీసు రోడ్లు…