Khairatabad Ganesh: జై బోలో గణేష్ మహరాజ్ కీ జై.. గణపతి బప్పా మోరియా.. నినాదాలతో ఖైరతాబాద్ పరిసరాలు మారుమోగాయి. ఆదివారం సెలవు దినం కావడంతో గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి భారీ క్యూలు కనిపించాయి. లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారని ఉత్సవ కమిటీ తెలిపింది. మరోవైపు ఇంటి గణపతులు సముద్ర తీరం వైపు అడుగులు వేస్తుంటే నగరమంతా బొజ్జ గణపయ్యల సందడితో మారుమోగింది. హుస్సేన్ సాగర్‌లో వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు శివారు ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తుండటంతో ట్యాంక్‌బండ్ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. నిమజ్జనం సజావుగా సాగేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
Read also: Minister KTR: మూసీ నదిపై 5 కొత్త వంతెనలు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్
భారీ గణస్థుణ్ణి చూసేందుకు భక్తులు ఉదయం నుంచి భారీ క్యూలైన్లలో బారులు తీరారు. అయితే.. నగర ప్రజలే కాదు.. ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో… ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. మింట్ కాంపౌండ్, ఖైరతాబాద్ చౌరస్తా, లక్డీకపూల్, టెలిఫోన్ భవన్ రోడ్లపై ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. మెట్రోలు, ఆర్టీసీ బస్సులు జనంతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ జనంతో నిండిపోయింది.
Minister KTR: మూసీ నదిపై 5 కొత్త వంతెనలు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్