GHMC Tender: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ పెరుగుతున్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కింద ఏడు స్టీల్ బ్రిడ్జిలు, ఏడు అండర్ పాస్‌లు నిర్మించనున్నారు. మొత్తం రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. హెచ్‌సిటి (H-City) ప్రాజెక్టులలో భాగంగా నగరంలోని పలు ప్రధాన రహదారుల్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
Read Also: IND vs PAK: నేడే భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఉత్కంఠ పోరు.. గెలిచేదెవరో.. ?
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టెండర్లను ఈ నెల 27 నుండి మార్చి 24 వరకు దాఖలు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. టెండర్ దాఖలు చేసేవారి కోసం మార్చి 10న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రి-బిడ్ మీటింగ్ నిర్వహించనున్నారు. అనంతరం మార్చి 26న బిడ్ ప్రైజ్ ఓపెనింగ్ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ భారం తగ్గి నగరవాసులకు సౌకర్యవంతమైన రహదారి వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని అధికారుల అంచనా.
Read Also: IPS Officers Transfers: భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు..