Traffic in Hyderabad: నల్లకుంట, మాసాబ్ ట్యాంక్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అబిడ్స్ వరకు గణేష్ విగ్రహాలు క్యూ కట్టారు. దీంతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెక్లెస్ రోడ్డులోపల వినాయకుడిని తరలిస్తున్నారు అధికారులు. ట్యాంక్ బండ్ పైకి భారీ విగ్రహాలు చేరుకున్నాయి. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్క్, నెక్లెస్ రోడ్డులో అధికారులు నిమజ్జనాన్ని ముమ్మరం చేశారు. తెలుగుతల్లి నుంచి నారాయణగూడ వరకు వన్‌వే రోడ్డుకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఆర్‌బీఐ నుంచి లకిడికాపూల్‌కు వన్‌వే రోడ్డును అనుమతించారు. నిమజ్జనం పూర్తయిన వాహనాలను ఖైరతాబాద్ వైపు నుంచి పంపుతున్నారు. రసూల్ పురా జంక్షన్‌లో ట్రాఫిక్ భారీగా ఉంది. లిబర్టీ, బషీర్‌బాగ్, కంట్రోల్ రూమ్, ఆర్‌బిఐ, మాసబ్ ట్యాంక్ జంక్షన్‌లకు భారీగా ట్రాఫిక్ చేరుకుంది. ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్ మీదుగా వెళ్లే వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ మీదుగా వెళ్లే వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
Read also: Minister KTR: కేటీఆర్‌తో కసిరెడ్డి, జైపాల్ భేటీ.. ఆసక్తికరంగా మారిన సమావేశం..!
భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనానికి భక్తులు బారులు తీరారు. నిన్న(గురువారం) ఉదయం వినాయక నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం అనంతరం అధికారులు నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేశారు. నిన్న సాయంత్రం కురిసిన వర్షం కారణంగా నిమజ్జన ప్రక్రియ కాస్త నెమ్మదించింది. వర్షంలోనూ కవాతు కొనసాగింది. ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్ బండ్‌పై గణపతి నిమజ్జనానికి క్యూ కట్టారు. నిమజ్జనం పూర్తి కావడానికి మధ్యాహ్నం వరకు పట్టే అవకాశం ఉంది. వినాయక నిమజ్జన శోభాయాత్ర మధ్యాహ్నం 1:00 గంటలకు చార్మినార్ వద్ద ముగిసింది. పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది.
Nara Lokesh: నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన విచారణ.. కాసేపట్లో నోటీస్!