Drunken Drive : మద్యం సేవించి వాహనం నడపడం చాలా ప్రమాదకరమైన చర్య. మద్యం మనం కళ్లతో చూస్తున్నదానిపై కూడా ప్రభావం చూపుతుంది, మన మస్తిష్కాన్ని, నాడీ వ్యవస్థను క్రమంగా ప్రభావితం చేస్తుంది. ఇది మన అవగాహనను తగ్గించి, మనం తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. అందుకే.. మద్యం సేవించి వాహనాన్ని నడపవద్దని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ కొందరు పట్టించుకోకుండా.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత మూడు నెలలుగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ వివరాలను హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం విడుదల చేసింది.. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది ట్రాఫిక్ విభాగం. గడిచిన 3 నెలలు ఆగస్టు 24 నుంచి నవంబర్ 21 వరకు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 13,933 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. భారీ ఆధిక్యంలో టీమిండియా
వివిధ కోర్టుల్లో 13,188 చార్జిషీట్లు దాఖలు చేసినట్లు, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 52,080 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గత 3 నెలల్లో 824 మంది మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి 1 నుంచి 10 రోజుల వరకు జైలు శిక్ష, 2 రోజుల పాటు 227 మంది మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి సామాజిక సేవ చేయాలని మేజిస్ట్రేట్ ఆదేశించినట్లు తెలిపారు. RTO ద్వారా 99 డ్రైవింగ్ లైసెన్స్‌లను 2 నుండి 6 నెలల పాటు సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారందరిపై 2,87,20,600/- జరిమానా విధించినట్లు, 09.11.2024న మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు స్పెషల్ డ్రైవ్‌లో 327 మంది డ్రంక్ డ్రైవర్లను పట్టుకుని, వారిపై U/s 185 of M.V. చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఒక్క రోజులో 44 మంది మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి 04-10-2024 నాడు గరిష్టంగా 4 రోజులు, కనిష్టంగా 2 రోజులు శిక్ష విధించి జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 44 మంది జైలుకు పంపబడిన వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్‌లు సస్పెండ్ చేయబడ్డాయని, గత 3 నెలల్లో పట్టుబడిన డ్రైవర్లలో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు 11,904 (85%) పట్టుబడినట్లు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో గోషామహల్, బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.
Priyanka Gandhi: ప్రియాంక అరంగేట్రం అదిరింది.. లోక్‌సభలో అడుగుపెట్టేదెప్పుడంటే..!