తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతో పాటు.. హైదరాబాద్‌లో కుండ పోత వర్షాలు కురుస్తున్నాయి… మంగళవారం.. ఇవాళ ఉదయం నుంచి మూడు నాలుగు దపాలుగా మహానగరంలో భారీ వర్షం దంచికొట్టింది… ఇక, లోతట్టు ప్రాంతాలతో పాటు.. రోడ్లపై వాహనదారులు నరకం చూడాల్సి వచ్చింది.. అయితే, మంగళవారం నుంచి కురుస్తోన్న భారీ వర్షంతో.. పలు కాలనీలు వరదనీటిలో మునిగిపోయాయి… మూసీ నదిలో మళ్లీ వరద పోటెత్తింది. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీ ప్రవాహం మూసారాంబాగ్ బ్రిడ్జి పై…
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం దంచికొడుతుంది. సోమవారం ఉదయం నుంచి వాతావరణంలో మార్పులు కనిపించింది. కాస్త ఎండ నగరాన్ని తాకిన ఉదయం 10.45 గంటల నుంచి వర్షం నగరాన్ని ముంచెత్తింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఎస్‌ఆర్ నగర్, కూకట్‌పల్లిలో కుండపోత వర్షం కురుస్తోంది. గండిపేట, బండ్లగూడ, రాజేంద్రనగర్, గచ్చిబౌలి,షేక్‌పేట, మణికొండ, బషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, కవాడిగూడ, దోమల్‌గూడ, భోలక్‌పూర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, జవహర్ నగర్, గాంధీనగర్, షేక్‌పేట, రాయదుర్గం, రాజేంద్రనగర్,…