హైదరాబాద్‌లో మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఇవాళ ఉదయం నుంచి కురిసిన వర్షానికి నగరవాసులు తడిసిముద్దయ్యారు. భారీ వర్షం వల్ల రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు రావడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వర్షం పడిందంటే సెంటీమీటర్లలో ఉంటుంది.. ఈ మధ్య హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో వానలు దంచికొట్టాయి.. ఇప్పుడు మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.. రేపటి నుంచి అంటే.. మంగళవారం నుంచి మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు…
Heavy Rains In Hyderabad City: కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకున్న వరుణుడు.. మరోసారి విజృంభించాడు. హైదరాబాద్ నగరంలో తాండవం చేశాడు. బంజారాహిల్స్, లక్డికపూల్, అసెంబ్లీ, సచివాలయం, నాంపల్లి, కోఠి, సికింద్రాబాద్, మాధాపూర్, అమీర్‌పేట, ఎస్సార్ నగర్, బేగంపేట, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, గోషామహల్, అబిడ్స్, సుల్తాన్ బజార్, అంబర్పేట్, బషీర్‌బాగ్, అఫ్జల్ గంజ్, రాజేంద్రనగర్, అత్తాపూర్, మణికొండ, నార్సింగీ, మెహదీపట్నం, కార్వాన్, మాసబ్ ట్యాంక్, మల్లేపల్లి తదితర ప్రాంతాల్లో వరుణుడు చెలరేగిపోయాడు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడం,…