తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, యాదాద్రి, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో.. వికారాబాద్, శంకర్‌పల్లిలో వరదనీరు చేరింది. దీంతో.. గండిపేట జలాశయానికి భారీగా వరద నీరు…
తెలంగాణలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్కుమార్, నీటి పారుదలశాఖ అధికారులు, ఈఎన్సీలు, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో జోరు వాన కురిసింది. ఏకధాటి వర్షానికి మరోసారి వాగులు, వంకలు ఉప్పొంగాయి. రహదారులపైకి వరద నీరు చేరి.. వాహనదారులకు ఇబ్బంది ఏర్పడింది. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవటంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తోంది. బాటసింగారం పండ్ల మార్కెట్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. మార్కెట్‌లోని దుకాణాలన్నీ తడిసిముద్దయ్యాయి. మార్కెట్ ప్రాంగణంలో నిల్వ ఉంచిన పండ్లన్నీ తడిసిపోయాయి. భారీ వర్షం వల్ల మార్కెట్‌లోకి ప్రవాహం దూసుకొచ్చింది. బత్తాయితో పాటు వివిధ రకాల పండ్లు వర్షం నీటిలో కొట్టుకుపోవడంతో వాటిని కాపాడుకునేందుకు వ్యాపారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.