బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు… మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని వెల్లడించింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మెదక్, మహబుబ్‌నగర్ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఏపీ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జోరుగా…
హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. తెల్లవారుజాము నుంచే కుండపోత వానమొదలైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌లో భారీగా వర్షం కురిసింది. అబిడ్స్, కోఠి, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్‌లో ప్రధాన రహదారులపై వరద పొంగిపొర్లుతోంది. కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీ, జగద్గిరిగుట్టలో కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. లక్డీకాపూల్, సికింద్రాబాద్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్ జంక్షన్లలోని రోడ్లపై నీళ్లు చేరాయి. రహదారులపై చేరిన నీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు నగర శివారు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తోంది. గండిపేట్,…
నైరుతీ గాలుల ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాగల 24 గంటల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు,మెరుపులతో కూడి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. రాబోయే 24 గంటల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. అతి తేలికపాటి నుంచి తేలికపాటి…
హిమాయత్ సాగర్ మరో రెండు గేట్లను మూసివేశారు. గడచిన రెండు రోజుల నుండి వర్షపాతం తగ్గినందువల్ల.. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట)లకు ఎగువ నుండి వచ్చే వరద నీటి ఉద్ధృతి తగ్గింది. దీంతో తగినంత ఇన్ ఫ్లో లేని కారణంగా .. ఉన్నతాధి కారుల సూచనల మేరకు ఈ రెండు జలాశయాల గేట్లను జలమండలి అధికారులు నిన్న మూసివేసారు. నేడు ఈ వరద ప్రవాహం మరింత తగ్గు ముఖం పట్టడంతో హిమాయత్ సాగర్…
గత కొన్ని రోజులుగా దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, భాగ్యనగరంలో ప్రతిరోజూ మద్యాహ్నం సమయంలో వర్షం కురుస్తున్నది. ఈ రోజు కూడా నగరంలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. ఈ వర్షానికి రోడ్లన్నీ తడిసిముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లొకి వర్షం నీరు చేరుతున్నది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అబిడ్స్, హిమాయత్ నగర్, సికింద్రాబాద్, బేగంపేట, నాంపల్లి, ఎంజే…
తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. ఇక, హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూనే ఉంది.. మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో.. సాయంత్రం మరికొన్ని ప్రాంతాల్లో.. రాత్రికి ఇంకొన్ని ప్రాంతాల్లో అన్నట్టుగా వర్షం దంచికొట్టింది.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.. వరుసగా మూడు రోజుల పాటు.. అంటే ఈ నెల 12, 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో భారీ నుంచి…