రెండు రోజులు నుంచి వర్షాలు తగ్గాయని అనుకునేంతలోపే మళ్లీ తెలుగు రాష్ట్రాలపై మరోసారి వరుణుడు గర్జించనున్నాడు వర్షం నగరాన్ని ముంచెత్తింది. షియర్ జోన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు తెలంగాణ, కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీగా వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ, రేపు హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు హైదరాబాద్‌లో అక్కడక్కడా భారీ…
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షంతో పాటు, ఈ రోజు అత్యంత భారీ వర్షాలు అక్క డక్కడ వచ్చే అవకాశం ఉందని.. ఎల్లుండి భారీ వర్షాలు అక్క డక్కడ పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
తెలంగాణలోకి బుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది.. మొన్న రాత్రి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవగా.. మంగళవారం పరిస్థితి భిన్నంగా ఉంది.. పగటిపూట ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగిపోయాయి.. అయితే, రాత్రి నుంచి మళ్లీ పరిస్థితి మారిపోయింది.. అక్కడక్క వర్షం కురిసింది.. మరోవైపు, ఇక నుంచి వర్షాలు దంచికొట్టే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉదయం నుంచే హైదరాబాద్ సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు…
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఇటు రైతులు, అటు తెలంగాణ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏరువాకకు సిద్ధం కావాల్సిన రైతులు రుతుపవనాల కోసం ఎదురుచూస్తుంటే.. భానుడి భగ భగల నుంచి ఉపశమనం కోసం తెలంగాణ వాసులు ఎదురుచూస్తున్నారు. అయితే వీరి నిరీక్షణకు తెర దించే విధంగా సోమవారం సాయంత్రం తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తెలంగాణలోని మహబూబ్నగర్ వరకు విస్తరించిన రుతుపవనాలు మరో రెండు రోజుల్లో పూర్తిగా విస్తరిస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే..…