Telangana Weather News: నగరాన్ని ముంచెత్తిన వాన.. నేడు.. రేపు భారీ వర్ష సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం దంచికొడుతుంది. సోమవారం ఉదయం నుంచి వాతావరణంలో మార్పులు కనిపించింది. కాస్త ఎండ నగరాన్ని తాకిన ఉదయం 10.45 గంటల నుంచి వర్షం నగరాన్ని ముంచెత్తింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఎస్‌ఆర్ నగర్, కూకట్‌పల్లిలో కుండపోత వర్షం కురుస్తోంది. గండిపేట, బండ్లగూడ, రాజేంద్రనగర్, గచ్చిబౌలి,షేక్‌పేట, మణికొండ, బషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, కవాడిగూడ, దోమల్‌గూడ, భోలక్‌పూర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, జవహర్ నగర్, గాంధీనగర్, షేక్‌పేట, రాయదుర్గం, రాజేంద్రనగర్, కిస్మత్‌పురా, సికింద్రాబాద్, బేగంపేట, దిల్‌సుఖ్‌నగర్, చాదర్‌ఘాట్ ఎల్బీనగర్, వనస్థలిపురంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
గత కొన్ని రోజుగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉండగా.. ఇవాళ మరోసారి కురిసిన భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్, బంజారాహిల్స్, మాధాపూర్ పరిసర ప్రాంతాల్లో రోడ్డు పైనే మోకాలిలోతు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ సహాయక బృందాలు, ట్రాఫిక్ పోలీసులు రోడ్లపైకి చేరిన నీటిని మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. వరద నీటిలో వాహనాలు నెమ్మదిగా కదులుతుండటం కూడా ట్రాఫిక్ సమస్యకు మరో కారణమైంది. ఆదివారం సాయంత్రం దాదాపు గంటన్నర పాటు భారీ వర్షం కురవడంతో.. భారీ ట్రాఫిక్ స్తంబించింది. దీంతో వాహన దారులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో సరదాగా బయటకు వచ్చిన వారంతా భారీ వర్షానికి తడిసి ముద్దయ్యారు.
Also Read
NIA: ఉగ్రకదలికలపై ఎన్‌ఐఏ సోదాలు.. ఆదివారం పలు రాష్ట్రాల్లో దాడులు
తాజావార్తలు
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?