Fire Breaks Out: హైదరాబాద్ లోని పాతబస్తీలో ఉన్న దివాన్‌దేవిడి ప్రాంతంలోని మదీనా అబ్బాస్ టవర్స్‌లో తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం అర్ధరాత్రి దాటాక ఉదయం 2:15 గంటలకు జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. నాలుగో అంతస్తులో ఉన్న 40కి పైగా బట్టల దుకాణాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 10 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మదీనా సర్కిల్ వద్ద…
GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం నామినేషన్ల స్వీకరణ నేటి నుండి ప్రారంభమైంది. అభ్యర్థులు ఈ నెల 17వ తేదీ వరకు తమ నామినేషన్ పత్రాలు జిహెచ్ఎంసి కార్యదర్శి కార్యాలయంలో సమర్పించవచ్చు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, తమ నామినేషన్ పత్రాలను మరో ఇద్దరు కార్పొరేటర్ల మద్దతుతో సమర్పించాలి. నామినేషన్ల స్వీకరణ ఫిబ్రవరి 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. Read Also: Rohit…
VC Sajjanar : తమ క్షేత్రస్థాయి ఉద్యోగులు, అధికారులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్ వర్చ్ వల్ సమావేశాలు నిర్వహించారు. హైదరాబాద్ బస్ భవన్ నుంచి శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా ఈ సమావేశాలు జరిగాయి. సంస్థ పనితీరు, సంక్రాంతి ఆపరేషన్స్, ఉద్యోగుల సంక్షేమం, మహాలక్ష్మి-మహిళలకు ఉచిత రవాణా సౌకర్య పథక అమలు, తదితర అంశాలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశాల్లో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్…
ACB Rides: ట్రాన్స్పోర్ట్ శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్ అక్రమ ఆస్తుల కేసులో చిక్కుకున్నారు. శ్రీనివాస్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలపై ఏసీబీ అధికారులు హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, జగిత్యాల, ఇతర ప్రాంతాల్లోని శ్రీనివాస్ బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఏకకాలంలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, జగిత్యాల సహా మొత్తం 8 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో పుప్పాల శ్రీనివాస్ పెద్ద ఎత్తున అక్రమ…
Car Fireaccident : మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజీ గూడ ఫ్లైఓవర్‌పై ఘోర ఘటన చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో జరుగుతున్న మల్లన్న జాతరను తిలకించేందుకు హైదరాబాద్ పాత బస్తీకి చెందిన నలుగురు యువకులు కారులో బయలుదేరారు. అయితే, ప్రయాణానికి కొద్దిసేపటికే పోచారం సమీపంలోని అన్నోజీ గూడ ఫ్లైఓవర్‌పైకి చేరుకునే సరికి కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. Telangana Secretariat : తెలంగాణ సెక్రటేరియట్‌ను పేల్చి వేస్తానని బెదిరింపులు.. అప్రమత్తమైన యువకులు కారును వెంటనే…
Telangana Secretariat : సెక్రటేరియట్ వద్ద ఓ మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేశాడు. తెలంగాణ సెక్రటేరియట్‌ను పేల్చి వేస్తానని బెదిరింపులు దిగాడు సదర్ వ్యక్తి. అయితే.. మూడు రోజుల నుంచి లంగర్ హౌజ్ కు చెందిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీ అధికారులకు ఫోన్ చేస్తున్నాడు. దర్గాకు సంబంధించి ఓ సమస్యపై ప్రభుత్వానికి తాను అర్జి పెట్టుకున్నానని, అధికారులు స్పందించక పోవడంతో అధికారులకు బెదిరింపులు దిగాడు. ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులో తీసుకొని విచారించారు ఎస్పీఎఫ్…
Road Accident: నార్సింగ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువ వైద్యుడు ప్రాణాలు కోల్పోగా, మరో వైద్యురాలు తీవ్రంగా గాయపడింది. ప్రమాద సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు ఖానాపూర్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో జస్మిత్ అనే యువ వైద్యుడు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. భూమిక అనే మరో వైద్యురాలు తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈ ఇద్దరు వైద్యులు జన్వాడలో జరిగిన ఓ ఫంక్షన్…
Fire Accident : హైదరాబాద్ నగరంలోని ట్యాంక్‌బండ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం రాత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన భారతమాతకు మహా హారతి కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ఈ వేడుకల సందర్భంగా హుస్సేన్ సాగర్‌లో బోట్లపై బాణాసంచా కాల్చుతుండగా, అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో హుస్సేన్ సాగర్‌లో రెండు బోట్లు మంటల్లో కాలి పోయాయి. ఈ బోట్లలో ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 15 మంది ప్రయాణిస్తుండగా, వారందరూ బోట్ల నుంచి…
హైదరాబాద్ చింతల్‌బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. షాదన్ కాలేజీ ఎదురుగా ఉన్న కూల్చివేతలను దానం నాగేందర్ అడ్డుకున్నారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై మండిపడ్డారు.
Rachakonda CP: రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నేతృత్వంలో డ్రగ్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సైనిక్‌పురిలో గ్యాస్ వ్యాపారం ముసుగులో హెరాయిన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాస్ స్టవ్ విడిభాగాల ముసుగులో ఈ ముఠా హెరాయిన్‌ను సరఫరా చేస్తుండగా.. కన్స్యూమర్లకు ర్యాపిడో, ఓలా, ఉబేర్ వంటి రవాణా సేవల ద్వారా డ్రగ్స్ అందజేస్తున్నారని విచారణలో వెల్లడైందని కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఈ ముఠా చాలా కాలంగా…