Traffic Rules In Hyderabad: హైదరాబాద్ నగరంలో రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ సమయంలో నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ పునరుద్ధరణ చర్యలు అమలు చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఆంక్షలలో, మూడు కమిషనరేట్ల పరిధిలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేయడం, బేగంపేట్ టోవ్లీచౌకి ఫ్లైఓవర్ సహా ఇతర ఫ్లైఓవర్లను కూడా మూసివేయడంచేయనున్నారు. అయితే, పీవీ ఎక్స్‌ప్రెస్ వే పై ఎయిర్‌పోర్టుకు…
Allu Arjun : సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనపై ఈ రోజు అల్లు అర్జున్ను విచారించారు పోలీసులు. అయితే.. అల్లు అర్జున్ పోలీసుల విచారణలో ఘటనకు సంబంధించిన వీడియో చూసి అల్లు అర్జున్ ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. మూడు గంటల 35 నిమిషాలు అల్లు అర్జున్ ని పోలీసులు విచారించారు. కొన్ని వాటికి తనకు తెలియదని.. థియేటర్ లోపల చీకటిగా ఉన్ననందున అర్ధం కాలేదు అని సమాధానం చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. తన వల్ల కొన్ని మిస్టేక్స్…
CP Avinash Mohanty : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అనువల్ రిపోర్ట్ – 2024ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ.. 37689 కేసులను ఈ ఏడాది రిజిస్టర్ చేశామని తెలిపారు. మొత్తం రిజిస్టర్ అయిన కేసుల్లో 32 శాతం సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. 70 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల నుంచి బాధితులకు రిఫండ్ చేసి ఇచ్చామని సీపీ మహంతి అన్నారు. ఎకనామిక్…
Allu Arjun: సంధ్య తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పీఎస్‌లో హీరో అల్లు అర్జున్ విచారణ పూర్తి అయింది. విచారణ ముగిసిన అనంతరం ఎవరితో మాట్లాడకుండానే అల్లు అర్జున్ కారులో వెళ్లిపోయారు. అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన, అనంతరం జరిగిన…
CP CV Anand : హైదరాబాద్ సిటీ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. తన వ్యక్తిగత ఎక్స్ ఖాతా ద్వారా, “విచారణ కొనసాగుతున్న సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా రెచ్చగొట్టే ప్రశ్నలు వేయరంతో నేను కాస్త సహనాన్ని కోల్పోయాను. నేను చేసినది పొరపాటుగా భావిస్తున్నాను. పరిస్థితులు ఏవీ అయినా, సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. నా వ్యాఖ్యలను మనస్ఫూర్తిగా వెనక్కి…
Chalo Raj Bhavan: తెలంగాణ రాష్ట్రంలో మరో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకోనుంది. ఈ రోజు హైదరాబాద్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం జరగనుంది. ఈ నిరసనల్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం అంతటా దేశవ్యాప్త సమస్యలపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం, కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ…
Sandhya Theatre: పుష్ప-2 ప్రీమియర్ (డిసెంబర్ 04) సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 35 ఏళ్ల మహిళ మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీతేజ అనే 9 ఏళ్ల పిల్లాడు తీవ్రంగా గాయపడి, 12 రోజులుగా ఆస్పత్రి బెడ్‌పై మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు. ఈ ఘటనలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి, ఇందులో కేసులు నమోదు అవడం, అల్లు అర్జున్ అరెస్ట్, రిమాండ్,…
CP CV Anand : తెలంగాణ ప్రభుత్వము గురుకులాలలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు, పొలిటికల్ లీడర్లు వసతి గృహాలను సందర్శించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలో హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్‌లింగంపల్లిలో ఉన్న మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ సందర్శించారు హైదరాబాద్ CP CV ఆనంద్. ఈ సందర్భంగా విద్యార్థులతో వారి సమస్యలు, వారికి ఉన్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇస్తున్న బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ విషయమై ప్రిన్సిపల్…
Physical Harassment : హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ ప్రాంతంలో నివాసం ఉండే ఓ మహిళను మరో ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం ఆపై హత్య యత్నం చేశారు తండ్రీకొడుకులు. ఫంక్షన్ హాల్ లలో పని ఉందని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్యాయత్నం చేశారు సదరు నిందితులు. అయితే.. సమాచారం మేరకు తండ్రి కొడుకులను వికారాబాద్ చెంగుమల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ చావు బ్రతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతునట్లు సమాచారం. ఈ దారుణమైన సంఘటన ఆలస్యంగా…