ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్‌ను ఈడీ సీజ్ చేసింది. 4 గంటల పాటు ఫ్లైట్‌ను చుట్టుముట్టి అందులో ఉన్న వాళ్లను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ స్కాం కేసులో నిందితులు ఇదే ఫ్లైట్‌లో దుబాయ్ కి పారిపోయారు.
భాగ్యనగర వాసులకు జీహెచ్ఎంసీ (GHMC) శుభవార్త చెప్పింది. ఆస్తి పన్ను చెల్లింపులో వడ్డీపై 90 శాతం డిస్కౌంట్‌తో ఓటీఎస్ అవకాశం కల్పిస్తుంది. బకాయిదారులకు బల్దియా ఓటీఎస్ అవకాశం కల్పించింది. ఈ నెలాఖరు వరకు పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేవారికి ఈ ఆఫర్ వర్తించనుంది.
రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి అగ్నిప్రమాదం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. తాజాగా బహుదూర్ పురాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బహదూర్‌పుర x రోడ్డులోని లారీ మెకానికల్ వర్క్ షాపులో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఈ మెకానికల్ వర్క్…
పంజాగుట్టలోని ఓ హోటల్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. షాన్‌బాగ్ హోటల్లోని ఐదో అంతస్తులో మంటలు ఎగసి పడ్డాయి. కిచెన్‌లోని తందూరి రోటీ బట్టీలోని చిమ్మిలో ఆయిల్ పేరుకు పోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
HCU : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (HCU) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. భవనం నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో, అక్కడే పనిచేస్తున్న కార్మికులు తీవ్ర ప్రమాదంలో చిక్కుకున్నారు. అదనపు మట్టిశ్రమకు లోనైన కార్మికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భవనం కూలిపోవడం గమనించిన తోటి కార్మికులు, యూనివర్సిటీ సిబ్బంది హుటాహుటిన స్పందించి శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే…
GHMC : లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంగర్ హౌస్ హుడా పార్క్ చెరువు శుభ్రం చేసే క్రమంలో తండ్రి కొడుకుల మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. లంగర్ హౌస్ లోని హుడా పార్క్ చెరువులో చెరువు శుభ్రం చేసే ఔట్సోర్సింగ్ సిబ్బంది మహమ్మద్ కరీం (38 ) ఈరోజు శివరాత్రి సందర్భంగా స్కూలుకి సెలవు ఉండడం వల్ల తన కొడుకు సాహిల్ (15)ను తనతో పాటు తీసుకువచ్చాడు. ఈరోజు మధ్యాహ్నం సుమారు…
హైదరాబాద్‌లోని మేడ్చల్ పరిధి ఈసీఐఎల్ x రోడ్లో దారుణం చోటు చేసుకుంది. తండ్రిపై కత్తితో దాడి చేశాడు ఓ కసాయి కొడుకు.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో.. తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా.. కత్తితో దాడి చేస్తున్నా స్థానికులు అడ్డుకునేందుకు ముందుకు రాలేదు. వారం రోజుల్లో మేడ్చల్ పరిధిలో ఇది మూడో మర్డర్. అయితే.. తీవ్రంగా గాయపడ్డ తండ్రిని ఈసీఐఎల్‌లోని శ్రీకర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.
GHMC : ఆస్తిపన్ను బకాయిల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలో టాప్ టెన్ బకాయి విలువ 203 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారెంట్లు జారీ చేసింది జీహెచ్ఎంసీ. వందమందికి రెడ్ నోటీసులు జారీ చేసింది జీహెచ్ఎంసీ. 5 లక్షలకుపైన ఉన్న బకాయిల విలువ 860 కోట్లుగా అధికారులు తేల్చారు. ఈ చర్యలలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు ఇటీవల బంజారాహిల్స్ ప్రాంతంలోని ప్రముఖ తాజ్ బంజారా హోటల్‌ను సీజ్ చేశారు. హోటల్…
Bandi Sanjay : హైదరాబాద్ లోని మెర్క్యురీ హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈసారి కేంద్ర బడ్జెట్ లో పన్నులు, పథకాల రూపంలో తెలంగాణకు రూ.1.08 లక్షల కోట్లు కేటాయించామన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్దమని, కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని కబోధులు కాంగ్రెస్ నేతలు అని ఆయన విమర్శించారు. 6 గ్యారంటీలపై డైవర్ట్ చేయడానికే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ బాటలోనే…