HCU : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (HCU) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. భవనం నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో, అక్కడే పనిచేస్తున్న కార్మికులు తీవ్ర ప్రమాదంలో చిక్కుకున్నారు. అదనపు మట్టిశ్రమకు లోనైన కార్మికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భవనం కూలిపోవడం గమనించిన తోటి కార్మికులు, యూనివర్సిటీ సిబ్బంది హుటాహుటిన స్పందించి శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే…
GHMC : లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంగర్ హౌస్ హుడా పార్క్ చెరువు శుభ్రం చేసే క్రమంలో తండ్రి కొడుకుల మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. లంగర్ హౌస్ లోని హుడా పార్క్ చెరువులో చెరువు శుభ్రం చేసే ఔట్సోర్సింగ్ సిబ్బంది మహమ్మద్ కరీం (38 ) ఈరోజు శివరాత్రి సందర్భంగా స్కూలుకి సెలవు ఉండడం వల్ల తన కొడుకు సాహిల్ (15)ను తనతో పాటు తీసుకువచ్చాడు. ఈరోజు మధ్యాహ్నం సుమారు…
హైదరాబాద్‌లోని మేడ్చల్ పరిధి ఈసీఐఎల్ x రోడ్లో దారుణం చోటు చేసుకుంది. తండ్రిపై కత్తితో దాడి చేశాడు ఓ కసాయి కొడుకు.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో.. తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా.. కత్తితో దాడి చేస్తున్నా స్థానికులు అడ్డుకునేందుకు ముందుకు రాలేదు. వారం రోజుల్లో మేడ్చల్ పరిధిలో ఇది మూడో మర్డర్. అయితే.. తీవ్రంగా గాయపడ్డ తండ్రిని ఈసీఐఎల్‌లోని శ్రీకర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.
GHMC : ఆస్తిపన్ను బకాయిల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలో టాప్ టెన్ బకాయి విలువ 203 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారెంట్లు జారీ చేసింది జీహెచ్ఎంసీ. వందమందికి రెడ్ నోటీసులు జారీ చేసింది జీహెచ్ఎంసీ. 5 లక్షలకుపైన ఉన్న బకాయిల విలువ 860 కోట్లుగా అధికారులు తేల్చారు. ఈ చర్యలలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు ఇటీవల బంజారాహిల్స్ ప్రాంతంలోని ప్రముఖ తాజ్ బంజారా హోటల్‌ను సీజ్ చేశారు. హోటల్…
Bandi Sanjay : హైదరాబాద్ లోని మెర్క్యురీ హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈసారి కేంద్ర బడ్జెట్ లో పన్నులు, పథకాల రూపంలో తెలంగాణకు రూ.1.08 లక్షల కోట్లు కేటాయించామన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్దమని, కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని కబోధులు కాంగ్రెస్ నేతలు అని ఆయన విమర్శించారు. 6 గ్యారంటీలపై డైవర్ట్ చేయడానికే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ బాటలోనే…
Moinabad Farmhouse : ఇటీవల హైదారాబాద్ నగర శివారు మొయినాబాద్ పరిధిలోని తొల్కట్టలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తుండటంతో పోలీసులు దాడి చేసి పందెంరాయుళ్లతో పాటు పందెం కోళ్లను పట్టుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. ఈ రోజు మొయినాబాద్ తోల్కట్ట ఫామ్ హౌస్ కేసులో స్వాధీనం చేసుకున్న పందెం కోళ్లకు వేలం వేశారు. అయితే.. రాజేంద్రనగర్ కోర్టు ఆవరణలో పందెం కోళ్లకు వేలం నిర్వహిస్తున్నారు…
HMWSSB : హైదరాబాద్ మహానగర జలమండలి (HMWSSB) గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1లోని కొండపాక పంపింగ్ స్టేషన్ వద్ద మరమ్మతులు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 17న (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 18న (మంగళవారం) ఉదయం 6 గంటల వరకు ఈ పనులు జరగనున్నాయి. ఈ సమయంలో నగరంలోని అనేక ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. పంపింగ్ స్టేషన్ వద్ద చేపట్టనున్న పనులు: 3000 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌కు 900…
తాను ప్రేమించిన అమ్మాయి కుటుంబీకుల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఖలందర్ నగర్లో చోటు చేసుకుంది.
Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై జరిగిన దాడి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు (KTR) రంగరాజన్‌ను వ్యక్తిగతంగా పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఇది అత్యంత దుర్మార్గమైన, నీచమైన చర్య. దీన్ని ఎవరు చేసినా, ఏ పేరుతో చేసినా ఉపేక్షించకూడదని అన్నారు. దేవాలయ సేవలో నిమగ్నమవుతున్న రంగరాజన్, సౌందర్య…