Allu Arjun: సంధ్య తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పీఎస్‌లో హీరో అల్లు అర్జున్ విచారణ పూర్తి అయింది. విచారణ ముగిసిన అనంతరం ఎవరితో మాట్లాడకుండానే అల్లు అర్జున్ కారులో వెళ్లిపోయారు. అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన, అనంతరం జరిగిన…
CP CV Anand : హైదరాబాద్ సిటీ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. తన వ్యక్తిగత ఎక్స్ ఖాతా ద్వారా, “విచారణ కొనసాగుతున్న సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా రెచ్చగొట్టే ప్రశ్నలు వేయరంతో నేను కాస్త సహనాన్ని కోల్పోయాను. నేను చేసినది పొరపాటుగా భావిస్తున్నాను. పరిస్థితులు ఏవీ అయినా, సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. నా వ్యాఖ్యలను మనస్ఫూర్తిగా వెనక్కి…
Chalo Raj Bhavan: తెలంగాణ రాష్ట్రంలో మరో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకోనుంది. ఈ రోజు హైదరాబాద్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం జరగనుంది. ఈ నిరసనల్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం అంతటా దేశవ్యాప్త సమస్యలపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం, కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ…
Sandhya Theatre: పుష్ప-2 ప్రీమియర్ (డిసెంబర్ 04) సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 35 ఏళ్ల మహిళ మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీతేజ అనే 9 ఏళ్ల పిల్లాడు తీవ్రంగా గాయపడి, 12 రోజులుగా ఆస్పత్రి బెడ్‌పై మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు. ఈ ఘటనలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి, ఇందులో కేసులు నమోదు అవడం, అల్లు అర్జున్ అరెస్ట్, రిమాండ్,…
CP CV Anand : తెలంగాణ ప్రభుత్వము గురుకులాలలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు, పొలిటికల్ లీడర్లు వసతి గృహాలను సందర్శించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలో హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్‌లింగంపల్లిలో ఉన్న మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ సందర్శించారు హైదరాబాద్ CP CV ఆనంద్. ఈ సందర్భంగా విద్యార్థులతో వారి సమస్యలు, వారికి ఉన్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇస్తున్న బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ విషయమై ప్రిన్సిపల్…
Physical Harassment : హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ ప్రాంతంలో నివాసం ఉండే ఓ మహిళను మరో ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం ఆపై హత్య యత్నం చేశారు తండ్రీకొడుకులు. ఫంక్షన్ హాల్ లలో పని ఉందని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్యాయత్నం చేశారు సదరు నిందితులు. అయితే.. సమాచారం మేరకు తండ్రి కొడుకులను వికారాబాద్ చెంగుమల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ చావు బ్రతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతునట్లు సమాచారం. ఈ దారుణమైన సంఘటన ఆలస్యంగా…
Speaker Gaddam Prasad : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, తాను ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ప్రజాస్వామ్య విధానాలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తనకు మద్దతు ఇచ్చి స్పీకర్ పదవిలోకి రావడానికి తోడ్పడిందని గుర్తుచేశారు, కానీ బీఆర్ఎస్ నేత కేటీఆర్ తనపై వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు. ఇంకా బీఆర్ఎస్ తన విధానాన్ని మార్చుకోలేదని,…
BJP Poru Sabha: నేడు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో బీజేపీ పోరు సభ నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ సభ నిర్వహిస్తోంది.
HYDRA : హైడ్రా (Hyderabad Water Resources Development and Reclamation Authority) హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, పార్కులను రక్షించి, వాటిని ఆక్రమణల నుంచి విముక్తి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థ. ఈ సంస్థ పారిశుద్ధ్య పరిశ్రమల పనితీరును మెరుగుపరచడం, పర్యావరణాన్ని సంరక్షించడం లక్ష్యంగా పనిచేస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే గ్రేటర్ పరిధిలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనట్లు సమాచారం అందినా అక్కడ అక్రమార్కుల భరతం పడుతున్నారు హైడ్రా…
Fire Accident : చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి గుల్మోహర్ పార్క్ సిగ్నల్ వద్ద గల సోఫా తయారీ షాపులో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుల్మోహర్ పార్క్ సిగ్నల్ వద్ద మహావీర్ సోఫా వర్క్స్, మస్కిటో డోర్స్ షాప్ చాలాకాలంగా నిర్వహిస్తున్నారు. ఈ షాపులో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగి షాప్ పూర్తిగా దగ్ధం అయింది. అర్ధరాత్రి వేళ ప్రమాదం చోటుచేసుకోవడంతో భారీ ప్రమాదం తప్పింది. షాపులోని సోఫాలు, ఇతర సామాగ్రి…