Betting Gang : హైదరాబాద్లోని హఫీజ్పేట్లో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠాను మియాపూర్ SOT పోలీసులు బట్టబయలు చేశారు. ఫేక్ కంపెనీల పేరిట బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసి, ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న భార్యభర్తలను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మాడిశెట్టి అజయ్, అతని భార్య సంధ్య కలిసి మూడు క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ద్వారా భారీ స్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించబడింది. పోలీసులు వీరి అకౌంట్లను పరిశీలించగా, ఏకంగా 40 లక్షల రూపాయల విలువైన…
Gun Fire : హైదరాబాద్, గుడిమల్కాపూర్లోని కింగ్స్ ప్యాలెస్లో నిర్వహించిన ఆనం మీర్జా ఎక్స్పోలో కాల్పుల కలకం చోటుచేసుకుంది. ఎక్స్పోలో ఇద్దరు షాప్ కీపర్ల మధ్య వాగ్వాదం తలెత్తి తీవ్ర స్థాయికి చేరుకుంది. తీవ్ర వాగ్వాదం అనంతరం, వారిలో ఒకరు గాలిలో కాల్పులు జరపడంతో అక్కడున్న వారిలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. కాల్పుల శబ్దంతో సందడి నెలకొనగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గాలిలో కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని…
బెట్టింగ్ యాప్ కేసులో నేడు పంజాగుట్ట పోలీసుల ముందుకు నటి విష్ణు ప్రియ మరోసారి రానుంది. ఈనెల 25న విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే పంజాగుట్ట పోలీసులు చెప్పారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టులో విష్ణుప్రియకు చుక్కెదురైంది. విచారణకు సహకరించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇవాళ పంజాగుట్ట పోలీసుల ముందుకు విచారణకు విష్ణు ప్రియ హాజరుకానుంది.
ప్రముఖ స్వీట్ షాపులో అయితే ఎలాంటి కల్తీ ఉండదు.. నాసిరకం ఉండదని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ కూడా కల్తీ జరుగుతుందని విషయం ఇప్పుడు బయటపడింది.. ఎందుకంటే ప్రముఖ స్వీట్ షాపులకు సరఫరా చేస్తున్నా తయారీ కేంద్రం పైన ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఈ సోదాల్లో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. మల్లాపూర్ లోని అమన్ స్వీట్స్ తయారీ కేంద్రం పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు.. భయంకరమైన నిజాలతో వెంటనే…
Drunken Drive : హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో నిందితుడికి ఏడాదిన్నర కఠిన కారాగార శిక్ష విధించబడింది. తాగిన మైకంలో నిర్లక్ష్యంగా ఆటో నడిపి ఒక గర్భిణీ మహిళ, ఆమె కడుపులో ఉన్న శిశువు మరణానికి కారణమైన ఈ ఘటనపై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2017లో జరిగిన ఈ విషాదకర ఘటనలో, ఓరుగంటి సుభాష్ (43), వృత్తి ఆటో డ్రైవర్, హయత్నగర్ పరిధిలోని కుంట్లూరు గ్రామానికి చెందిన వ్యక్తి,…
ఆర్థిక వనరుల సమీకరణ పేరిట రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 25(పి) లో ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ద్వారా వేలం వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ అంశపై తాజాగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే ఆపాలని పేర్కొన్నారు.
Fire Accident : హైదరాబాద్లోని కోకాపేట GAR టెక్ పార్క్లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు ఐటీ ఉద్యోగులకు తీవ్రగాయాలు కాగా, కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బిల్డింగ్లోని రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలినట్లు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్లో వందలాది మంది ఉద్యోగులు ఉండటంతో అప్రమత్తమైన అధికారులు వారిని వెంటనే తగిన చర్యలు తీసుకొని…
మన దేశంలో పెద్ద నోట్లు పూర్తిగా రద్దు అయిపోయినాయి ..ఇప్పుడు ఎక్కడ చూసినా చిన్న నోట్లో కనబడుతున్నాయి.. అందులో 500 రూపాయల నోట్లు ఎక్కువగా చలామణి అవుతున్నాయి ..ఎవరి దగ్గర చూసినా చిన్న నోట్ల కంటే 500 రూపాయలు నోట్లు ఎక్కువగా ఉంటాయి.. చిల్లర నోట్లు అసలు కనబడకుండా పోయినాయి.. ఈ 500 నోట్ల చలామణిలో అసలు నోట్లు ఎంత నకిలీ నోట్లు ఎంత అనేది ఎవరికీ తెలియదు ..ఎందుకంటే నకిలీ నోట్లో తయారుచేసి చాలా మంది…
Wine Shops : గ్రీష్మకాలం సమీపిస్తున్న వేళ మద్యం ప్రియులకు ఊహించని షాక్. ఎండల వేడి నుండి కాస్త ఉపశమనం కోసం బీర్లు, మద్యం ఆశ్రయించే మందుబాబులకు, ఈ నెల 14వ తేదీ ప్రత్యేకంగా చేదు అనుభవం కలిగించనుంది. నగర పోలీసులు హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్లోని మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా, సామాజిక అసౌకర్యాన్ని నివారించేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు…
స్విఫ్ట్ కారు ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎంజీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఎంజీఐటీ కాలేజ్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న.. 6గురూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈరోజు డుమ్మా కొట్టారని తెలిపారు. "ఒక్కసారి స్టూడెంట్స్ కాలేజ్ లోనికి వచ్చారంటే బయట వెళ్ళడానికి వీలులేదు. నార్సింగి మూవీ టవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని మధ్యహ్నం 3:30 గంటలకు సమాచారం అందింది.