Ponnam Prabhakar : హైదరాబాద్ లో ఒక్కసారిగా ఈదురు గాలులు భారీ వర్షం కురవడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. వర్షపాతం ప్రభావం జీహెచ్ ఎంసీ ప్రాంతాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఒక్కసారిగా ఈదురుగాలులతో నగరంలో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగినట్టు అధికారులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఎమర్జెన్సీ టీమ్స్ డిఆర్ఎఫ్ బృందాలు విరిగిన చెట్లను తొలగించాలని ట్రాఫిక్ ఇబ్బందులు…
MMTS Train Case: హైదరాబాద్ లోని MMTS ట్రైన్లో అత్యాచారయత్నం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసు ఇప్పుడు సంచలన మలుపు తిరిగింది. ట్రైన్ లో యువతి పై జరిగినదన్న అత్యాచారం అబద్ధంగా తేలింది. ఈ కేసులో రైల్వే పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ట్రైన్ లోనుండి జారిపడిన యువతి, అనంతరం తనపై అత్యాచారం జరిగిందని కథ అల్లింది. ఆమె కథనాల…
Hyderabad Metro: 2017లో ప్రారంభమమైన హైదరాబాద్ మెట్రో రైలు సేవలు దేశంలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) ప్రాజెక్టుగా నిలిచింది. ఈ మెట్రో సేవలు నగరంలోని ముఖ్య ప్రాంతాలను కలుపుతూ ప్రతిరోజూ లక్షలాది మందికి సేవలందిస్తున్నాయి. అధిక రహదారి ట్రాఫిక్, కాలుష్య సమస్యల నేపథ్యంలో మెట్రో సేవలు నగర ప్రజల దైనందిన జీవితంలో ఒక భాగంగా మారాయి. ఇకపోతే తాజాగా హైదరాబాద్ మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ (L&T) సంస్థ రూ.6,500 కోట్లకు…
హైదరాబాద్లో మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో అపార్ట్మెంట్లో లిప్టు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలుడు అక్బర్ (10)మృతి చెందాడు. బంతితో ఆడుతూ బంతి లిఫ్ట్ గోతిలో పడడంతో తీయడానికి వెళ్లాడు అక్బర్ పటేల్. అదే సమయంలో లిఫ్ట్ వెయిట్ తలపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
KTR : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు (కేటీఆర్) మరోసారి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ వేదికగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్న తీరును తీవ్రంగా ఎత్తిచూపారు. కేటీఆర్ మాట్లాడుతూ, “హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రావడం లేదు. ఇదే వారికి ప్రజల నుంచి వచ్చిన అసలైన తీర్పు,” అని పేర్కొన్నారు. జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్…
Phone Tapping : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక అడుగు పడింది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న శ్రవణ్ రావును సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) అధికారులు 11 గంటల పాటు విచారించారు. ఉదయం ప్రారంభమైన విచారణ రాత్రి వరకు కొనసాగింది. సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో పలువురు ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చి ఉండే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. శ్రవణ్ రావు వద్ద నుండి స్వాధీనం…
Fraud Treatment: ప్రస్తుతకాలంలో యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటిగా బట్టతల మారింది. ఈ సమస్యతో ఎంతో మంది యువకులు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నా ఒప్పుకోవాల్సిన విషయం ఇది. ఈ మధ్యకాలంలో చాలామందికి చిన్న వయసులోనే జుట్టు ఊడిపోయి బట్టతల రావడం సాధారణంగా కనిపిస్తూనే ఉంది. పరిస్థితులు ఏవైనా కావొచ్చు.. ఈ సమస్య మాత్రం దేశంలో పెద్దమొత్తంలోనే ఉంది. ఈ బట్టతలతో బయటకి వెళ్లాలన్నా, ముఖ్యంగా యువకులు పెళ్లి విషయంలో అయినా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే…
Murder : ముషీరాబాద్ పీఎస్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదు అయిన వ్యక్తి స్వప్నం సింగ్ (59) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నెల నాలుగో తేదీన అల్వాల్ నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్వాల్ పిఎస్ లో 0 ఎఫైర్ నమోదు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. అల్వాల్ లో నివాసం ఉండే స్వప్నం సింగ్ తన సోదరుడు హరిదీప్ సింగ్ ను ముషీరాబాద్…
సీతారాంబాద్ ఆలయం నుంచి శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది. భక్తుల జన సందోహం మధ్య శోభాయత్ర సాగుతోంది. జైశ్రీరామ్ నినాదాలతో సీతారాంబాద్ ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. సీతారాంబాగ్ ఆలయం నుంచి కోటి వ్యాయామ శాల వరకు శోభాయాత్ర సాగనుంది. శ్రీరాముని శోభాయాత్ర భద్రత విధుల్లో 20 వేల మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు.. ఈ శోభాయాత్ర సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పలు కీలక సూచనలు చేశారు.
బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యమయ్యారు. న్యూ బోయిన్పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసం ఉండే మహేశ్, ఉమా దంపతులు, వారి ముగ్గురు పిల్లలతోపాటు సంధ్య అనే మరో కుటుంబ సభ్యురాలు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.. మిస్సింగ్ గురైన బాధిత కుటుంబ సభ్యులు ఎన్టీవీతో మాట్లాడారు. "న్యూ బోయిన్పల్లి నుండి మా అన్నయ్య ఫ్యామిలీ మిస్సింగ్ అయ్యారు.