బెట్టింగ్ యాప్ కేసులో నేడు పంజాగుట్ట పోలీసుల ముందుకు నటి విష్ణు ప్రియ మరోసారి రానుంది. ఈనెల 25న విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే పంజాగుట్ట పోలీసులు చెప్పారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టులో విష్ణుప్రియకు చుక్కెదురైంది. విచారణకు సహకరించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇవాళ పంజాగుట్ట పోలీసుల ముందుకు విచారణకు విష్ణు ప్రియ హాజరుకానుంది.
READ MORE: RCB: చెత్త రికార్డును బద్దలు గొట్టిన ఆర్సీబీ.. ఎగిరి గంతేస్తున్న అభిమానులు..
ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్ని కుదిపేస్తున్నే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో నటి విష్ణు ప్రియాకు భారీ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్స్ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. బెట్టింగ్ యాప్స్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ విష్ణు ప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సమయంలో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు విష్ణు ప్రియకు ముందుస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. విచారణ అధికారి ఎదుట హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
READ MORE: Bollywood : హిట్ సినిమా సీక్వెల్ తో డైరెక్టర్ మారుతున్న హృతిక్ రోషన్