Drunken Drive : హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో నిందితుడికి ఏడాదిన్నర కఠిన కారాగార శిక్ష విధించబడింది. తాగిన మైకంలో నిర్లక్ష్యంగా ఆటో నడిపి ఒక గర్భిణీ మహిళ, ఆమె కడుపులో ఉన్న శిశువు మరణానికి కారణమైన ఈ ఘటనపై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2017లో జరిగిన ఈ విషాదకర ఘటనలో, ఓరుగంటి సుభాష్ (43), వృత్తి ఆటో డ్రైవర్, హయత్‌నగర్ పరిధిలోని కుంట్లూరు గ్రామానికి చెందిన వ్యక్తి, మద్యం మైకంలో ఆటో నడుపుతూ రోడ్డు దాటుతున్న ఓ గర్భవతిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గర్భిణీ మహిళ తీవ్రంగా గాయపడగా, ఆమె కడుపులోని శిశువు సహా ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనకు సంబంధించి హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం ఎల్‌బీ నగర్ కోర్టు ఈ కేసును విచారించింది. నిందితుడు సుభాష్‌ను దోషిగా నిర్ధారించిన న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు. నిందితుడికి 1.5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడింది. అదనంగా రూ. 500/- జరిమానా కూడా విధించారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.వి. బీనా వాదనలు వినిపించారు. ఈ తీర్పు మద్యం మైకంలో డ్రైవింగ్ చేసే వ్యక్తులకు గుణపాఠంగా మారనుంది. పోలీసులు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో కేంద్ర నిధులపై బీజేపీ-కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం